ఓ వ్యక్తికి చేపలు పట్టడానికి వెళ్లాడు. చాలా సేపటి నుంచి ఎదురుచూస్తే.. తాను వేసిన గేలానికి ఓ చేప పడింది. ఎంతో ఆనందంగా చేప దొరికిందని బయటకు తీసి చూస్తే... గుండె ఆగినంత పని అయ్యింది. రాడ్డు బయటకు తీయగానే చేపతో పాటు.... దానిని మింగడానికి ప్రయత్నిస్తున్న ఓ పాము కూడా ఉండటం విశేషం. ఈ సంఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది.

తాను గాలం వేసిన చేప... దానిని చుట్టుకొని చేప తినేందుకు సిద్ధంగా ఉన్న పామును చూసి ఆ వ్యక్తి తొలుత బయపడ్డాడు. తర్వాత తేరుకొని వెంటనే ఆ ఘటనను తన కెమేరాలో బంధించాడు. దానిని పట్టుకొని తన ముఖం ఎలా ఉందో కూడా అతను వీడియోలో చిత్రీకరించడం విశేషం. ఆ పాము చాలా భయంకరంగా ఉంది.

పాము బందిలో చేప ప్రాణాలతో కొట్టుకుంటోంది. విచిత్రం ఏమిటంటే... పాము బందీలో చేప... ఆ వ్యక్తి బంధీలో పాము ఉన్నాయి. ఇంచు మించు రెండూ ప్రాణాల కోసం కొట్టుకుంటున్నట్లే ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని ఆ వ్యక్తి ట్విట్టర్ లోపోస్టు చేయగా వైరల్ అయ్యింది. కేవలం కొన్ని గంటల్లో ఆ వీడియోల్లో లక్షల్లో వీక్షించారు. 50వేల మందికిపైగా కామెంట్స్ చేశారు. మీరు కూడా ఓ సారి ఈ వీడియో వైపు లుక్కేయండి.