కట్టుకున్న భర్త పట్ల ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. భర్త మీద ఉన్న కోపంతో అతని పురుషాంగాన్ని కోసేసింది. వృధ్యాప్యంలో ఉన్నాడని కూడా చూడకుండా..తాళ్లతో కట్టేసి మరీ పురుషాంగం కోసేసింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...అమెరికాలోని నార్త్ కరోలినా న్యూపోర్ట్‌లో జేమ్స్ ఫ్రాబట్(61) అనే వ్యక్తి భార్య విక్టోరియా కలిసి ఉంటున్నాడు. భర్త తీరుపై విక్టోరియా ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరు గొడవపడ్డారు. దీంతో కోపంతో రగిలిపోయిన విక్టోరియా భర్తను తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టింది. అనంతరం కత్తితో అతడి పరుషాంగాన్ని కోసేసింది. దీంతో జేమ్స్ బాధతో విలవిల్లాడిపోయాడు.

రాత్రంతా భర్త బాధను చూసి పైశాచికానందనం పొందిన విక్టోరియా మంగళవారం ఉదయం పోలీసులు ఫోన్ చేసి తన నిర్వాకం గురించి చెప్పింది. దీంతో కార్టకెట్ కౌంటీ పోలీసులు వారింటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడివున్న జేమ్స్‌, పక్కనే పడివున్న అతడి పురుషాంగాన్ని చూసి షాకయ్యారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జేమ్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసులు విక్టోరియాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.