ఉక్రెయిన్‌పై, రష్యా (Russia)ల మధ్య రోజురోజుకు మరింతగా ముదురుతుంది. ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్‌లలో రష్యబలగాలను సిద్ధంగా ఉంచింది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్టులో సంచలన విషయాలు వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై, రష్యా (Russia)ల మధ్య రోజురోజుకు మరింతగా ముదురుతుంది. ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్‌లలో రష్యబలగాలను సిద్ధంగా ఉంచింది. ఉక్రెయిన్ సరిహద్దు వద్ద దాదాపు లక్ష మంది సైనికులు మోహరించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ పోస్టులో దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగించిన జెలెన్ స్కీ.. ఫిబ్రవరి 16వ తేదీన మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేయనున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో ఉక్రెయిన్ బుధవారం (ఫిబ్రవరి 16) ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుందని.. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసినట్టుగా జెలెన్ స్కీ చెప్పారు. తాము జాతీయ జెండాలను ఎగరవేస్తామని, పసుపు-నీలం రంగు రిబ్బన్‌లను ధరిస్తామని, ఉక్రెయిన్ ఐక్యతను ప్రపంచానికి చాటి చెబుతామని తెలిపారు.. చర్చల ద్వారా మరియు దౌత్య మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టుగా స్పష్టం చేశారు. ఇక, ఉక్రెయిన్ సాయుధ దళాలను జెల్‌న్ స్కీ ప్రశంసించారు. ఎనిమిది ఏళ్ల క్రితం కంటే సైన్యం బలంగా ఉందని చెప్పారు. సాయుధ బలగాలపై తమకు నమ్మకం ఉందన్నారు. తమ సైన్యం దేశం యొక్క మద్దతు ఉందని భావించాలని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో రష్యా సైనిక నిర్మాణం నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్రను ప్లాన్ చేసిందని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. అయితే ఆ ఆరోపణలను మాస్కో ఖండించింది. పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో.. US, NATO రష్యాతో అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. అయితే ఇప్పటివరకు ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగితే రష్యాపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది.
