గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు దేవభూమి కేరళను ముంచెత్తిన విషయం తెలసిందే. ఈ వరద నీటిలో ఇళ్లూ, వాకిలి కోల్పోయి కేరళ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల కేరళ రాష్ట్రం భారీగా నష్టపోయింది. దీంతో కేరళ రాష్ట్రాన్ని, వరద బాధితులను ఆదుకోడానికి యావత్ భారత దేశం కదిలింది. అయితే కేవలం భారత దేశమే కాదు ఈ మహావిపత్తుపై చలించి ప్రపంచ దేశాలు కూడా కేరళకు భారీ సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

ఇప్పటికే గల్ప్ దేశాల్లో ఒకటైన ఖతార్ రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూ. 700 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఆర్థిక సాయం గురించి అబుదాబి ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్లు విజయన్ తెలిపారు.

కేరళ కు సాయం ప్రకటించిన వివిధ రాష్ట్రాలకు, దేశాలకు విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వరదల తీవ్రత కాస్త తగ్గడంతో బాధితులు తమ ఇళ్లకు చేరుకుంటున్నారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. 

రాష్ట్రంపై వరదల ప్రభావం, సహాయక చర్యలు తదితర అంశాలను చర్చించేందుకు కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ సమావేశానికి అనుమతివ్వాలని కేరళ క్యాబినెట్ గవర్నర్ ని కోరింది. 


మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

కేరళకు రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన ఖతార్ రాజు

కేరళ వరదల్లో తడిచి చినిగిన సర్టిఫికెట్స్.. విద్యార్థి సుసైడ్

ఎంత దారుణం.. వరద బాధితులకు ఇలాంటివా డొనేట్ చేసేది..?