Asianet News TeluguAsianet News Telugu

వాటికన్‌లో కలకలం: పోప్ సన్నిహితులకు కరోనా

ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు విమాన ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నారు. 

Two close to the Pope test positive fo Coronavirus ksp
Author
Vatican City, First Published Dec 23, 2020, 3:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు విమాన ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నారు.

ఈ క్రమంలో వాటికన్ సిటీలో కలకలం రేగింది. క్రైస్తవుల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా మెలిగే ఇద్దరు మతాధికారుల (కార్డినల్స్‌)కు పాజిటివ్‌గా తేలింది. క్రిస్‌మస్‌ వేడుకల సందర్భంగా ఇటీవల వీరివురు పోప్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఘటనతో వాటికన్‌ వర్గాల్లో ఆందోళన మొదలైంది. పోప్‌ ‘రాబిన్‌ హుడ్‌’గా పిలిచే పాలిష్‌ కార్డినల్‌ కన్రాడ్‌కు మంగళవారం కరోనా నిర్ధారణ అయ్యింది. ఈయన తరచూ పోప్‌ను కలుస్తారు.

ఇదిలావుండగా వాటికన్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఇటాలియన్‌ కార్డినల్‌ బెర్టెల్లో సైతం కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

క్రిస్‌మస్‌ వేడుకలను పురస్కరించుకుని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో అధికారులు వీరివురు ఇటీవల కలిసిన వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios