లండన్: ఆధిపత్యం చెలాయించే మగవారు తోటివారికంటే త్వరగా నిర్ణయాలు తీసుకొంటారని ఓ అధ్యయన సంస్థ స్పష్టం చేసింది. ఈ లక్షణాలు ఉన్నవారు వేగంగా పైకి వస్తారని, అన్ని రంగాల్లోనూ ఆధిప్యతం చెలాయిస్తారని అధ్యయనంలో తెలిపింది. మనుషులైనా, జంతువులైనా.. ఆధిపత్యం అనేది చాలా కీలక పాత్ర పోషించడం సహజం. 

ఈనేపథ్యంలో కోల్‌ పాలిటెక్నిక్‌ ఫెడరల్‌ డీ లౌసన్నే పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. అందులో భాగంగవా 240 మంది విద్యార్థులైన బాలురను తీసుకొని వారిలోని ఆధిపత్య లక్షణాలను గమనించారు. ఆయా సందర్భాలను బట్టి సంతోషం, విషాద చిత్రాలపై వర్ణించమంటే కొందరు తడుముకోకుండా టక్కున సమాధానం చెప్తే మరికొందరు కాస్త ఆలస్యంగా స్పందించారని వివరించారు.