Asianet News TeluguAsianet News Telugu

కొంపముంచిన ‘ఎనర్జీ డ్రింక్’.. రోజుకు పన్నెండు తాగింది.. స్పృహ తప్పింది.. తీరా పరీక్షిస్తే షాకింగ్..

ఓ అనే వెబ్సైట్ లో ప్రచురించబడిన కథనం ప్రకారం...జ్యురిచ్ కు  చెందిన 17 ఏళ్ల మాషా అనే అమ్మాయికి ఎనర్జీ డ్రింక్ తాగడం అంటే చాలా చాలా ఇష్టం.  ఇక ఈ అలవాటు ఆమెకి ఒక వ్యసనంగా మారింది.  దీంతో రోజుకు పన్నెండు రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ తాగడం మొదలు పెట్టింది.  ఈ విషయాన్ని స్వయంగా మాషానే వెల్లడించింది.

This 17-year-old girl used to drink 12 cans of energy drinks in a day, slowly this condition happened to her
Author
Hyderabad, First Published Sep 28, 2021, 4:05 PM IST

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు.  అంటే ఏదైనా అతిగా చేయకూడదు దాని వల్ల మంచిది కాదు అని. మోతాదుకు మించి చేయడం వల్ల అనర్ధాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు.  ఇది ఓ అమ్మాయి విషయంలో కరెక్టుగా రుజువైంది.  కూల్ డ్రింక్ లేదా ఎనర్జి డ్రింక్స్(energy drinks) మితంగా తాగాలి.  వాటిని మోతాదుకు మించి తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 తాజాగా ఇలాంటి ఘటన  ఒకటి స్విట్జర్లాండ్ లో చోటు చేసుకుంది.  స్విట్జర్లాండ్ (Switzerland)దేశంలోని జ్యూరిచ్  నగరానికి చెందిన ఓ అమ్మాయికి  ఎనర్జీ డ్రింక్స్ అంటే మహా ఇష్టం.  కనీసం రోజుకు 12 రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంది.  ఈ అలవాటు కారణంగా ఆమెకు ఊహించని పరిణామం ఎదురయ్యింది.  ఆ కథేంటో తెలియాలంటే ఇది పూర్తిగా చదవాల్సిందే.

మిర్రర్ అనే వెబ్సైట్ లో ప్రచురించబడిన కథనం ప్రకారం...జ్యురిచ్ కు  చెందిన 17 ఏళ్ల మాషా అనే అమ్మాయికి ఎనర్జీ డ్రింక్ తాగడం అంటే చాలా చాలా ఇష్టం.  ఇక ఈ అలవాటు ఆమెకి ఒక వ్యసనంగా మారింది.  దీంతో రోజుకు పన్నెండు రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ తాగడం మొదలు పెట్టింది.  ఈ విషయాన్ని స్వయంగా మాషానే వెల్లడించింది.

ఇదే అలవాటు కొనసాగించింది మాషా.  అయితే ఓ రోజు హఠాత్తుగా స్కూల్లో వ్యాయామం చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది.  దీంతో స్కూల్ యాజమాన్యం ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించారు.  అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి మాషా  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఎనర్జీ డ్రింక్స్ వల్లే ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని టిక్ టాక్ వీడియో ద్వారా తన యూజర్లతో పంచుకున్న మాషా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా అలవాటు చేసుకోవద్దని రోజు సిగరెట్లు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే తాను ఇలా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios