ఆఫ్ఘనిస్తాన్ లో కూలిన ప్యాసింజర్ విమానం.. భారత్ కు చెందినదా ?
ఆప్ఘనిస్థాన్ ఘోర విమాన ప్రమాదం జరిగింది (plane accident in afghanistan). బదాఖ్షాన్ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ విమానం కూలిపోయింది (Passenger plane crashes in Badakhshan). అయితే ఇది భారత్ కు చెందిన విమానం అని తొలుత వార్తలు వచ్చాయి. ఈ వార్తలను డీజీసీఏ (Directorate General of Civil Aviation-DGCA) ఖండించింది.
ఆప్ఘనిస్థాన్ లోని బదాఖ్షాన్ ప్రాంతంలో శనివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ ఏజెన్సీ, ఖామా ప్రెస్ ప్రకారం.. ఆ విమానం వెళ్లాల్సిన మార్గం నుంచి పక్కకు తప్పి బదఖ్షాన్ లోని జెబాక్ జిల్లాలోని పర్వత భూభాగాన్ని ఢీకొట్టింది.
షోయబ్ తో విడాకులు నిజమే.. కొత్త జంటకు విషెష్ చెప్పిన సానియా మీర్జా..
ఈ విమానం తొలుత భారత్ కు చెందినదిగా వార్తలు వచ్చాయి. అయితే కొంత సమయం తరువాత ఆ విమానం ఏ భారతీయ విమానయాన సంస్థకు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టం చేసింది. ఇది భారత విమానం కాదని డీజీసీఏ అధికారి ధ్రువీకరించారు. బదాఖ్షాన్ ప్రావిన్స్ లోని కురాన్-ముంజన్, జిబక్ జిల్లాలతో పాటు టాప్ఖానా పర్వతాల్లో కూలిపోయిన విమానం మొరాకో రిజిస్టర్డ్ డీఎఫ్ 10 విమానం అని సీనియర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి ఒకరు తెలిపారు.
‘‘ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన దురదృష్టకరమైన విమాన ప్రమాదం భారత షెడ్యూల్డ్ విమానం (లేదా నాన్ షెడ్యూల్డ్ (ఎన్ఎస్ఓపి) / చార్టర్ విమానం కాదు. ఇది మొరాకో రిజిస్టర్డ్ చిన్న విమానం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ తన డీజీసీఏ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది. అయితే అంతకు ముందు భారత్ నుంచి ఆరుగురితో బయలుదేరిన విమానం మాస్కోకు చెందినదని రష్యా మీడియా పేర్కొంది.
కాగా.. ఈ ప్రమాదంలో బదాఖ్షాన్ లోని జెబాక్ జిల్లాతో సహా టాప్ ఖానా పర్వత ప్రాంతాల్లో ప్యాసింజర్ జెట్ విమానం కూలిపోయింది. అయితే విమానం రకం, ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే పలు ఆఫ్ఘన్ మీడియా పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని వెల్లడించాయి. కొన్ని ఇది చార్టర్డ్ విమానం అని, మాస్కోకు వెళ్తుండగా కూలిపోయిందని, మరికొందరు ఇది ప్రయాణీకుల విమానం అని పేర్కొన్నాయి.