Asianet News TeluguAsianet News Telugu

‘‘ఎల్‌టీటీఈ ఉన్నప్పుడే బాగుండేదన్న’’ తమిళ ఎంపీ అరెస్ట్.. అధికారపక్షమైనప్పటికీ.. !!

ఎల్‌టీటీఈ ఉన్నప్పుడే బాగుండేదంటూ చేసిన వ్యాఖ్యలకు గాను శ్రీలంకలో తమిళ ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశంలో నార్తర్న్ ప్రావిన్స్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళ ఎంపీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి విజయకళా మహేశ్వరన్ ఈ ఏడాది జూన్‌లో జాఫ్నాలో పర్యటించారు.

Sri Lanka MP arrests for hailing defeated Tamil rebels
Author
Sri Lanka, First Published Oct 9, 2018, 10:31 AM IST

ఎల్‌టీటీఈ ఉన్నప్పుడే బాగుండేదంటూ చేసిన వ్యాఖ్యలకు గాను శ్రీలంకలో తమిళ ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశంలో నార్తర్న్ ప్రావిన్స్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళ ఎంపీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి విజయకళా మహేశ్వరన్ ఈ ఏడాది జూన్‌లో జాఫ్నాలో పర్యటించారు.

ఈ సందర్భంగా అక్కడి బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. ఎల్‌టీటీఈ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు బాగుండేవని.. ఆ సమయంలో ఎలాంటి సామాజిక దురాచారాలు, అల్లర్లు ఉండేవి కావని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం..పార్లమెంటులో ఈ అంశంపై నిరసన వ్యక్తం చేయడంతో... ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె వ్యాఖ్యలు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయంటూ మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షే వ్యాఖ్యనించడంతో విజయకళను అరెస్ట్ చేయాలని ప్రధాని రణేలా విక్రమసింఘే ఆదేశించారు. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని సేకరించిన పోలీసులు... ఆయన ఆమోదముద్ర అనంతరం విజయకళను అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios