Asianet News TeluguAsianet News Telugu

‘అంతరాయానికి చింతిస్తున్నాం’.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన మాక్స్ జుకర్ బర్గ్

"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తిరిగి అందుబాటులోకి వచ్చాయి" అని జుకర్‌బర్గ్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

Sorry For Disruption Says Mark Zuckerberg After Largest Facebook Outage
Author
Hyderabad, First Published Oct 5, 2021, 8:11 AM IST

వాషింగ్టన్ : ఫేస్‌బుక్(Facebook), వాట్సాప్(WhatsApp), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సేవలకు అంతరాయం కలిగించినందుకు టెక్ దిగ్గజం సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్  (Mark Zuckerberg)ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు క్షమాపణలు (Apology) చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో సేవలు తిరిగి పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్నారు.

"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తిరిగి అందుబాటులోకి వచ్చాయి" అని జుకర్‌బర్గ్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

"ఈ రోజు అంతరాయం కలిగించినందుకు క్షమించండి. మీ ఆప్తులతో సన్నిహితంగా ఉండటానికి మీరు మా సేవలపై ఎంతగా ఆధారపడతారో నాకు తెలుసు" అని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.

సేవలు పునరుద్ధరించబడిన తరువాత మంగళవారం ఉదయం ట్విట్టర్‌లో, వాట్సాప్ ఇలా పోస్ట్ చేసింది : "ఈ రోజు వాట్సాప్‌ను ఉపయోగించలేకపోయిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాం. మేం నెమ్మదిగా, జాగ్రత్తగా వాట్సాప్‌ను మళ్లీ పని చేయించడం ప్రారంభించాము. మీ సహనానికి ధన్యవాదాలు. మీతో పంచుకునే మరింత సమాచారం ఉన్నప్పుడు మేము మీకు అప్ డేట్ చేస్తాం’ అని చెప్పుకొచ్చింది.

ఫేస్‌బుక్ కార్పొరేట్ అంబ్రెల్లా కింద ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఇతర సర్వీసులు ఇప్పుడు సాధారణంగా నడుస్తున్నాయని,  11:30 EST తర్వాత మొదటిసారి పూర్తిగా యాక్సెస్ చేయబడుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. 

ఇంటర్నెట్‌లో అంతరాయాల నివేదికలను పర్యవేక్షించే సైట్, డౌన్‌డెటెక్టర్ చెబుతున్న దానిప్రకారం ఫేస్‌బుక్ సేవలకు ఈ స్థాయిలో అంతరాయం కలగడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 10.6 మిలియన్ల ప్రాబ్లం రిపోర్టులు వచ్చాయని తెలిపారు. 

ప్రాబ్లం సాల్వ్ డ్.. అందుబాటులోకి వచ్చిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా సేవలు...

ఒక్క యుఎస్ నుంచే 1.7 మిలియన్లకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.  జర్మనీ నుంచి 1.3 మిలియన్ ఫిర్యాదులు,  నెదర్లాండ్స్ 9,15,000 ఫిర్యాదులు ఉన్నాయి. 

సోమవారం ఫేస్ బుక్ అంతరాయం వల్ల ఫేస్‌బుక్ కార్పొరేట్ అంబ్రెల్లా కిందున్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌తో సహా అనేక సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ ట్విట్టర్‌లో తన మెసెంజర్‌ని ఉపయోగించే వినియోగదారులు, ఫేస్‌బుక్‌లో పెద్ద ఎత్తున అంతరాయాల మధ్య, చాట్‌లను లోడ్ చేయడంలో, నోటిఫికేషన్‌లను స్వీకరించడంలో సమస్యలను ఎదుర్కొవచ్చని తెలిపింది. అసౌకర్యానికి కంపెనీ క్షమాపణలు చెప్పింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios