రష్యా అత్యంత శక్తివంతమై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీనిని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ, అధ్యక్షుడు పుతిన్ నిర్ధారించారు. ఇది క్షిపణి నిరోధక వ్యవస్థలను కూడా తప్పించుకొని ఏ లక్ష్యాలను అయినా ఛేదించగలదు.
సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించిందని అధ్యక్షుడు పుతిన్ బుధవారం తెలిపారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయని చెప్పారు. ఇది తమ దేశంపై దాడి చేయలనుకునే శత్రువులు రెండు సార్లు ఆలోచించేలా చేస్తుందని ఆయన అన్నారు.
పాశ్చాత్య విశ్లేషకులతో సాతాన్ 2గా పిలవబడే ఈ క్షిపణి రష్యా తరువాతి తరం క్షిపణులలో ఒకటి, దీనిని పుతిన్ ‘‘అజేయమైనది’’ అని అభివర్ణించారు. అయితే ఇందులో కింజాల్, అవన్‌గార్డ్ హైపర్‌సోనిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 24 నుంచి రష్యా దళాలు ప్రత్యేక సైనిక చర్యలో నిమగ్నమై ఉన్న ఉక్రెయిన్‌లో లక్ష్యాన్ని చేధించడానికి యుద్ధంలో మొదటిసారి కింజాల్‌ను ఉపయోగించినట్లు రష్యా గత నెలలో ప్రకటించింది. కాగా ‘‘సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అని పుతిన్ సైన్యంతో బుధవారం అన్నారు.
‘‘ ఈ నిజంగా ప్రత్యేకమైన ఆయుధం మన సాయుధ బలగాల పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. బాహ్య బెదిరింపుల నుండి రష్యా భద్రతను విశ్వసనీయంగా నిర్ధారిస్తుంది. దూకుడు వాక్చాతుర్యం వేడిలో మన దేశాన్ని బెదిరించడానికి ప్రయత్నించేవారిని ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.
కాగా ఉత్తర రష్యాలోని ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్‌లో ఈ పరీక్ష విజయవంతంగా జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ క్షిపణి శిక్షణ వార్‌హెడ్‌లను రష్యా కు చెందిన ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా పరీక్ష శ్రేణికి పంపిణీ చేసింది. ‘‘ సర్మత్ ప్రపంచంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సుదూర శ్రేణితో కూడిన అత్యంత శక్తివంతమైన క్షిపణి. ఇది మన దేశ వ్యూహాత్మక అణు బలగాల పోరాట శక్తిని గణనీయంగా పెంచుతుంది’’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది,
సర్మత్ సూపర్‌హీవీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి చిన్న ప్రారంభ బూస్ట్ దశతో క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా రూపొందించారు. ఇది శత్రు నిఘా వ్యవస్థలను ట్రాక్ చేయడానికి ఒక చిన్న విండోను ఇస్తుంది. 200 టన్నుల కంటే ఎక్కువ బరువున్న,బహుళ వార్‌హెడ్‌లను రవాణా చేయగలదని, అలాగే ఈ క్షిపణి భూమిపై ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగలదని పుతిన్ చెప్పారు.