Asianet News TeluguAsianet News Telugu

పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్

ఆ దేశ అధ్యక్షుడు మామూన్ హస్సేన్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసంలో జరిగింది. 

Prime Minister Imran Khan: PTI chairman sworn in as 22nd premier of Pakistan
Author
Hyderabad, First Published Aug 18, 2018, 11:21 AM IST

పాక్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్.. శనివారం పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు మామూన్ హస్సేన్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసంలో జరిగింది. 

ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన భార్య బుష్రా ఇమ్రాన్, ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ భజ్వా, ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వార్ ఖాన్, నావెల్ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహముద్ అబ్బాసీతో పాటు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, రమీజ్ రాజా, వసీం అక్రమం, గాయకులు సల్మాన్ అహ్మద్, అబ్రూల్ హక్, నటుడు జావిద్ షేక్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

ప్రధాని పదవికి పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అభ్యర్థి షాబాజ్ షరీఫ్ నామినేషన్లు దాఖలు చేశారు. స్పీకర్ అసద్ ఖైజర్ శుక్రవారం ఎన్నిక నిర్వహించగా.. దిగువ సభలోని మొత్తం 342 మంది సభ్యులకుగాను 272 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇమ్రాన్‌ఖాన్ 176 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి అభ్యర్థి షాబాజ్ షరీఫ్‌కు కేవలం 96 ఓట్లు వచ్చాయి. ప్రధాని పీఠంపై కూర్చోవడానికి 172 ఓట్లు పొందాల్సి ఉండగా.. ఇమ్రాన్‌ఖాన్ నాలుగు ఓట్లు అధికంగా పొందారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios