Asianet News TeluguAsianet News Telugu

Pakistan: పాకిస్తాన్ ఎన్నికల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకు పోటీ

పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకు పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. హఫీజ్ సయీద్ స్థాపించిన పీఎంఎంఎల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు.
 

pakistan terrorist hafiz saeed son talha saeed to contest pakistan elections kms
Author
First Published Dec 25, 2023, 9:07 PM IST

Hafiz Saeed: ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్, 26/11  ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకు పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. హఫీజ్ సయీద్ స్థాపించిన రాజకీయ పార్టీ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నది. ఈ పార్టీ జాతీయ, ప్రావిన్షయిల్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉన్నది.

అయితే, ఈ ఎన్నికల్లో టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ కూడా నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం లాహోర్ నుంచి పోటీ చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఐరాస గుర్తించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ 2019 నుంచి జైలులోనే ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేశారనే ఆరోపణల్లో దోషిగా తేలాడు. అమెరికా సయీద్ పై 10 మిలియన్ డాలర్ల బౌంటీని ప్రకటించింది.

2008 ముంబయి పేలుళ్లలో 166 మంది మరణించారు. ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ దాడులకు లష్కరే తాయిబా బాధ్యత వహించింది. ఈ ఉగ్రవాద సంస్థ కవర్ సంస్థే జమాత్ ఉద్ దవా. 

Also Read: క్లాస్‌మేట్‌ను పెళ్లి చేసుకోవాలని సెక్స్ చేంజ్ చేసుకుంది.. తర్వాత ఆమెనే చంపేసింది

హఫీజ్ సయీద్ స్థాపించిన పార్టీ పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖాలిద్ మసూద్ సింధు మాట్లాడుతూ.. పార్టీ దాదాపుగా అన్ని జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని వివరించారు. పీఎంఎంఎల్ పార్టీ చాలా చోట్ల జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు, ప్రజలు అందరు ఇస్లామిక్ వెల్ఫేర్ స్టేట్ ఏర్పాటు చేస్తామని పీఎంఎంఎల్ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios