Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్‌పై వీడియో: పాక్ అధ్యక్షుడికి ట్విట్టర్ నోటీసులు

కాశ్మీర్ అంశంలో తలదూర్చిన పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి ట్విట్టర్ షాకిచ్చింది. కాశ్మీర్ పరిస్థితులపై ఆయన పోస్ట్ చేసిన వీడియోలు భారతీయ చట్టాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ వెల్లడించారు. 

Pakistan President arif alvi Gets Notice from Twitter After He Shares Video of Protest Over Kashmir
Author
Islamabad, First Published Aug 27, 2019, 11:55 AM IST

జమ్మూకాశ్మీర్ అంశంలో భారత్‌ను ఇరుకున పెట్టాలని భావిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి స్పందన కరువైంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో కాశ్మీర్ కోసం యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కాశ్మీర్ అంశంలో తలదూర్చిన పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి ట్విట్టర్ షాకిచ్చింది. కాశ్మీర్ పరిస్థితులపై ఆయన పోస్ట్ చేసిన వీడియోలు భారతీయ చట్టాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నోటీసులు జారీ చేసింది.

ఈ విషయాన్ని ఆ దేశ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ వెల్లడించారు. వీటిపై స్పందించిన ఆయన.. నోటీసులు చాలా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

మరోవైపు కాశ్మీర్‌కు అనుకూలంగా పోస్ట్‌లు చేస్తున్న వారి ఖాతాలను సామాజిక మాధ్యమ సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు తొలగిస్తున్నాయని.. గత వారం పాక్ ఆర్మీ ప్రజాసంబంధాల డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్‌ సహా పలువురు అత్యున్నత అధికారులు ఆరోపించారు.

ట్విట్టర్ ప్రధాన కార్యాలయాల్లో భారతీయ సిబ్బంది ఉండబట్టే కాశ్మీర్‌కు అనుకూలంగా పోస్ట్‌లు చేస్తే తమ ఖాతాలు తొలగిస్తున్నారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios