పాకిస్తాన్ లో హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా.... ఆమె మృతి పట్ల పాక్ లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ వీధుల్లో పాకిస్తానీలు ఆందోళన చేపట్టారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..... ఇటీవల నమ్రతా అనే హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లర్కానాలోని బబీ అసిఫా డెంటల్‌ కాలేజీలోని తన హాస్టల్‌ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. 

మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్‌ విశాల్‌ సుందర్‌ పేర్కొన్నారు. లోపలి నుంచి తాళం వేసిన తన గదిలో మంచంపై పడిఉన్న నమిత్రా చందాని మెడకు తాడు బిగించి ఉంది. ఆమె గదికి తాళం వేసి ఉండటంతో సహ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్‌లో ఇటీవల మైనారిటీలపై దాడులు పెరుగుతున్న క్రమంలో హిందూ విద్యార్ధిని అనుమానాస్పద మృతి చోటుచేసుకోవడం గమనార్హం.