Organ Donation: దాదాపు మూడేళ్లుగా కోమాలో ఉన్న ఓ మహిళ ఆర్గాన్ డోనేషన్ సర్జరీ జరుగుతున్న సమయంలో కళ్లు తెరిచి డాక్టర్లతో పాటు కుటుంబసభ్యుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఈ విచిత్ర సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Organ Donation: ఆమె మూడేళ్లుగా కదలకుండా పడి ఉంది. శ్వాస మాత్రం ఉందో లేదో అనిపించేది. వైద్యులు కూడా ఆశలు వదిలేశారు. బ్రెయిన్‌డెడ్ అంటూ కుటుంబానికి సమాచారమిచ్చారు. ఇక ఆమె అవయవాలు ఇతరుల జీవితాల్లో వెలుగు ఇవ్వాలని భావించారు. అయితే.. శస్త్రచికిత్సకు క్షణాల ముందు ఒక అద్భుతం జరిగింది. ఆ మూగబోయిన శరీరం ఒక్కసారిగా స్పందించింది. ఆమె కన్ను రెప్పవేసింది! ఆ ఒక్క కదలిక.. వైద్యుల గుండెల్లో షాక్! వెంటనే సర్జరీ ఆపేశారు. నిశ్చలంగా కనిపించిన జీవితం.. మళ్లీ ఊపిరి పీల్చింది. ఈ అసాధారణ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. న్యూమెక్సికోకు చెందిన 38 ఏళ్ల డానెల్లా గల్లెగోస్ అనే మహిళ అనారోగ్యం నేపథ్యంలో 2022లో కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి కోమాలోనే ఉంది. దీంతో డాక్టర్లు ఆమె మామూలు మనిషి అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే న్యూ మెక్సికోకు చెందిన ఆర్గాన్ డోనేషన్ సర్వీస్.. డానెల్లా అవయవాలు డొనేట్ చేయాలని కుటుంబసభ్యులను కోరారు. దీంతో వారు అయిష్టంగానే ఆర్గాన్ డొనేషన్‌కు ఒప్పుకున్నారు.

డాక్టర్లు సర్జరీ చేస్తున్న సమయంలో డానెల్లా సడెన్ కళ్లు తెరిచింది. డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సర్జరీ ఆపేశారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. వారు ఎంతో సంతోషించారు. అయితే, డానెల్లా కంటిలో గాటు పడి ఉండటం కుటుంబసభ్యులు గమనించారు. దీనిపై డాక్టర్లతో గొడవపెట్టుకున్నారు. అది కత్తిగాటు కాదని, తడి కారణంగా రిఫ్లెక్షన్ అయి అలా కనిపిస్తోందని డాక్టర్లు వారికి సర్దిచెప్పారు.

డానెల్లా సోదరి ఆర్గాన్ డొనేషన్ సర్వీస్, డాక్టర్లపై దారుణమైన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ..‘డానెల్లాను సర్జరీకి తీసుకుపోతున్నపుడు ఆమె చేతిని పట్టుకున్నాను. ఆమెలో నాకు కదలిక కనిపించింది. డాక్టర్లకు కూడా ఈ విషయం తెలుసు. అయినా ఆర్గాన్ డొనేషన్ సర్వీస్ వాళ్ల ఒత్తిడితో ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు’ అని అంది. డాక్టర్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు. ఆర్గాన్ డొనేషన్ సర్వీస్ సభ్యులే డానెల్లాకు సర్జరీ జరగకుండా ఆపారని తెలిపారు. మొత్తానికి డానెల్లా చావు నుంచి బయటపడింది.

డానియెల్లా గల్లెగోస్ ఏమి చెప్పారు?

"నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను కానీ, క్లిష్ట పరిస్థితులు ఎంత త్వరగా మారాయి. ఆ రోజు గురించి ఆలోచించడం వింతగా ఉంది" అని డానియెల్లా గల్లెగోస్ ది న్యూయార్క్ టైమ్స్‌తో తెలిపారు. తరువాత ఆమె ఆరోగ్య, మానవ సేవల విభాగానికి ఫిర్యాదు చేసింది, ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విరాళం ప్రక్రియకు న్యూ మెక్సికో డోనర్ సర్వీసెస్ బాధ్యత వహిస్తుందని ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ తెలిపింది, అయితే వైద్య నిర్ణయాలలో జోక్యం చేసుకోలేదని సంస్థ ఖండించింది.

గతంలో కూడా ఇలాంటిదే.

అమెరికాలో ఇంతకు ముందు ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 2021లో థామస్ 'TJ' హూవర్ కు సంబంధించిన కేసు కూడా ఇలాంటిదే. హూవర్‌ను మందుల ఓవర్ డోస్ కారణంగా బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించి, ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఆపరేషన్‌కు ముందు ఆయన వణుకుతూ ఏడుస్తున్నట్లు గమనించారు. ఆ తర్వాత (కెంటకీ ఆర్గాన్ డోనర్ అఫిలియేట్స్) (KODA) ప్రక్రియను కొనసాగించమని ఒత్తిడి చేయబడింది. కానీ, వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత హూవర్ పూర్తిగా కోలుకుని తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు.