అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన సంఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరిగింది.

సోమవారం రాత్రి ఎక్‌మౌంట్‌ పట్టణంలో ఓ 14 ఏళ్ల బాలుడు ఐదుగురు కుటుంబసభ్యుల్ని కాల్చి చంపాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు. అతను ఉపయోగించిన తుపాకీ అత్యంత ఆధునాతనమైనదని... ఇది కుర్రాడి వద్దకు ఎలా చేరిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సొంత కుటుంబసభ్యుల్ని చంపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.