న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. ఓ కారు స్టోరు ముందు పార్కింగ్ లోకి దూసుకెళ్లి ఖాళీ ఎస్ యువీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న 18 మంది పాటు ఇద్దరు పాదచారులు మరణించారు. 

గత దశాబ్ద కాలంలో అమెరికాలో జరిగిన అతి పెద్ద రోడ్డు ప్రమాదం ఇదేని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఉల్లాసకరమైన శనివారం సాయంత్రం ఒక్కసారిగా హాహాకారాలతో విషాదవాతారవణాన్ని తలపించింది. 
  
న్యూయార్క్‌ రాష్ట్ర రాజధాని అల్బానీ సమీపంలోని షోహారీ కౌంటీలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన లిమో కారు సమీపంలోని ఓ కేఫ్‌లోకి చొచ్చుకెళ్లిందని పోలీసులు చెప్పారు. 

ఆ కారులో కొందరు  జన్మదిన వేడుకల విందుకు వెళ్తున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కేఫ్‌ బయట పలువురి మృతదేహాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.