Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయిన అమెరికా అధ్యక్షుడు..!

బ్రిటన్ ప్రధాన మంత్రి జాన్సన్ పేరు కరెక్ట్ గానే చెప్పి.. వెంటనే ఆస్ట్రేలియా ప్రధాని పేరు చెప్పలేకపోయారు.  పేరు సడెన్ గా గుర్తు రాకపోవడంతో స్నేహితుడిగా పేర్కొంటూ మాట్లాడారు. 

Joe Biden Forgets Australian PM's Name, Calls Him "Fellow Down Under"
Author
Hyderabad, First Published Sep 16, 2021, 12:46 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెద్ద పొరపాటు చేశారు. ఆయన.. ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. అమెరికా - ఆస్ట్రేలియా- బ్రిటన్ ఒప్పందం విషయమై వైట్ హౌస్ లో అధ్యక్షుడు జో బైడెన్ ఓ కీలక ప్రకటన చేశారు.

ఈ ప్రకటన నేపథ్యంలో  బైడెన్ వైట్ హౌస్ లో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోవడం గమనార్హం.  బ్రిటన్ ప్రధాన మంత్రి జాన్సన్ పేరు కరెక్ట్ గానే చెప్పి.. వెంటనే ఆస్ట్రేలియా ప్రధాని పేరు చెప్పలేకపోయారు.  పేరు సడెన్ గా గుర్తు రాకపోవడంతో స్నేహితుడిగా పేర్కొంటూ మాట్లాడారు. 

ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఇరు దేశాల ప్రధానులకు బైడెన్ దన్యవాదాలు తెలియజేశారు. అయితే... ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆస్ట్రేలియా ప్రధాని పేరు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆసిస్ ప్రధాని  స్కాట్ మోరిసన్ పేరు చెప్పకుండా స్నేహితుడు అంటూ సంబోధించాన్ని ఇప్పుడు చాలా మంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని చాలా పేపర్లు ఇదే హెడ్ లైన్ తో వార్తలు ప్రచురించడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios