Asianet News TeluguAsianet News Telugu

రైస్ కుక్కర్‌ను పెళ్లాడాడు.. నాలుగు రోజులకు విడాకులిచ్చాడు.. ఆయన చెప్పిన కారణాలివే..!

ఓ వ్యక్తి తనకు వంట చేసి పెడుతున్న రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ రైస్ కుక్కర్ తాను చెప్పినట్టు వింటుందని, చూడటానికి బాగుందని పేర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. నాలుగు రోజులకు విడాకులు ఇచ్చాడు. ఈ వ్యవహారమంతా ఫేస్‌బుక్‌లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ ఆనమ్ ఈ ఎపిసోడ్‌కు సృష్టికర్త.
 

indosinan marries rice cooker and divorces after four days
Author
New Delhi, First Published Oct 1, 2021, 8:28 PM IST

న్యూఢిల్లీ: పుర్రెకో బుద్ధి అన్నట్టు ఆ వ్యక్తి రైస్ కుక్కర్‌ను పెళ్లాడాడు. దాన్ని నిజంగా ఓ పెళ్లి కూతరులాగే ముస్తాబు చేశాడు. పక్కనే కూర్చోబెట్టుకుని సంతకాలు పెట్టాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి తాను రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించాడు. నెటిజన్లంతా షాక్.. ఆయన పోస్టులపై విపరీతమైన స్పందన వచ్చింది. కామెంట్లు పోటెత్తాయి. తీరా నాలుగు రోజులకు మరో పోస్టు చేశాడు. తాను ఆ రైస్ కుక్కర్‌కు విడాకులిస్తున్నట్టూ ప్రకటించాడు. నెటిజన్లు మరోసారి నివ్వెరపోయారు. ఆసక్తి కలిగిస్తున్న ఆ వ్యక్తి.. ఆ పెళ్లి గురించిన వివరాలు ఓ సారి చూద్దాం.

ఆయన పేరు ఖోయిరుల్ ఆనమ్. ఇండోనేషియా దేశస్తుడు. ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో షాకింగ్ పోస్టు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటాడు. తాజాగా, ఆయన తన రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇరువురూ తెల్ల దుస్తులు ధరించి పెళ్లికి ముస్తాబైన ఫొటోలు పోస్టు చేశాడు. పక్కన కూర్చోబెట్టుకుని సంతకాలు పెట్టాడు. తర్వాత కుక్కర్‌ను దగ్గరకు తీసుకుని కిస్ కూడా చేశాడు. కుక్కర్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆయన చెప్పిన కారణమూ అమాయకంగా అనిపిస్తుంది. కుక్కర్‌ తనతో పారదర్శకంగా ఉంటుందని, తాను చెప్పినట్టు వింటుందని, చూడటానికి కనులకు ఇంపుగా ఉంటుందని వివరించాడు.

 

నాలుగు రోజుల తర్వాత తాను కుక్కర్‌కు విడాకులిస్తున్నట్టు తెలిపాడు. దీనికి ఆయన ఓ కారణం చెప్పకపోలేదు. ఆ కారణమే మనమంతా అనుకున్నట్టుగా ఆనమ్ వట్టి అమాయకుడేమీ కాదని తెలిసివస్తుంది. ‘కుక్కర్ కేవలం వంట మాత్రమే చేసి పెడుతున్నది’ అంటూ తన విడాకులను ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు. మరోసారి షాక్ కావడం నెటిజన్ల వంతయింది. ఈ పెళ్లి, విడాకుల వ్యవహారమంతా కేవలం ఎంటర్‌టెయిన్‌మెంటేనని, సోషల్ మీడియాలో తనవైపు చూపు తిప్పుకునే తిప్పల్లో ఒకటని అందరికీ తెలిసిపోయింది. ఆనమ్ ఇలాంటి షాకింగ్ పోస్టులతో స్థానికంగా ఓ సెలెబ్రిటీ అయిపోయాడని స్థానిక మీడియా వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios