బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బలవంతంగా బయటకు లాగి.. అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

ఈ దారుణ ఘటనలో 14మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దుండగులు పారామిలటరీ యూనిఫాంలో వచ్చి.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ దాడికి పాల్పడింది మేమే అంటూ ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

దాడి జరిగిన బలోచిస్థాన్ ప్రాంతం.. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంది. మృతుల్లో నేవీ అధికారి ఒకరు, కోస్టల్ అధికారి ఒకరు ఉన్నట్లు గుర్తించారు.