Asianet News TeluguAsianet News Telugu

వీడి తెలివి మండా.. రా చికెన్ లో గన్ స్టఫ్ చేసి.. ఎయిర్ పోర్ట్ అధికారులకు దొరికిపోయి...

యూఎస్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి రా చికెన్ ను తరలిస్తూ పట్టుబడ్డాడు. రా చికెన్ లో గన్ ను స్టఫ్ చేశాడు. దీంతో అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. 

Gun found stuffed inside raw chicken at america airport
Author
First Published Nov 10, 2022, 11:48 AM IST

అమెరికా : అధికారికంగా తరలించే వీలున్న ప్రాంతంలో స్మగ్లింగ్ చేయడాన్ని ఏమంటారు.. అతి తెలివో.. అమాయకత్వమో.. లేకపోతే ఓవరాక్షనో కదా.. అలాగే చేసి అడ్డంగా బుక్కై జైల్లో కూర్చున్నాడో వ్యక్తి. నేరస్తులు రకరకాల మార్గాల్లో ఆయుధాలను, బంగారాన్ని కస్టమ్స్ అధికారుల కంటపడకుండా తరలిస్తుంటారు. కొన్నిసార్లు వీరు తరలించే విధానం షాక్ కు గురి చేస్తూ ఉంటుంది. కొంతమంది విగ్గుల్లోనూ, షూ, పెన్ లాంటి విచిత్రమైన ప్రదేశాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. మరికొందరు  శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ లోపల దాచుకుని కూడా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం చాలా కేసుల్లో చూసి ఉంటాం. ఈ క్రమంలోనే ఆయుధాలను కూడా చాలా వెరైటీగా తరలిస్తుంటారు. 

అయితే, వీరందరికంటే ఒక వ్యక్తికి భిన్నమైన ఆలోచన వచ్చింది.  వారందరి కంటే భిన్నంగా ఆయుధాన్ని తరలించే ప్రయత్నం చేసి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..  యూఎస్లోని ఒక వ్యక్తి చికెన్ లో గన్ ను స్టఫ్ చేసి చక్కగా ప్యాకింగ్ చేసుకుని ఫ్లోరిడాలోని లాడర్డేల్ హాలీవుడ్ విమానాశ్రమానికి వచ్చాడు. అక్కడ అందరు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నట్లుగానే ఇతడిని కూడా తనిఖీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. అతని వద్ద ఉన్న ప్యాకింగ్ చికెన్ ను చూసిఅధికారులకు కాస్త ఆశ్చర్యంతో పాటు, అనుమానం కూడా వచ్చింది.

బ్రిటన్ రాజు ఛార్లెస్ దంపతులమీదికి గుడ్లు విసిరిన నిరసనకారుడు.. అరెస్ట్...

దీంతో ఆ ప్యాకింగ్ కవర్ ని ఓపెన్ చేసి పరిశీలించగా.. ఆ చికెన్ లోపల గన్ ని కుక్కి ఉంచడాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్ కు గురయ్యారు. ఇంతవరకూ తాము వివిధ రకాల ఆయుధాలు తరలించడం చూశాం కానీ ఇలా ఇంత వింతగా తరలించేందుకు యత్నించడం చూసి ఆశ్చర్యపోయాం అన్నారు. దీంతో సదరు వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. వాస్తవానికి  యూఎస్ ఎయిర్ లైన్స్ లో తుపాకీలను నిషేధించలేదు. కానీ, ప్రయాణికులు వాటిని తీసుకొని వెళ్లేటప్పుడు తనిఖీ చేసే సామానులోనే తీసుకువెళ్లాలి. పైగా ఆ తుపాకులను అన్ లోడ్ చేసి హార్డ్ కంటైనర్లో లాక్ చేసి పట్టుకెళ్ళాలి. ఇలా అక్రమ మార్గంలో తరలించేందుకు యత్నిస్తే మాత్రం పోలీసులు ఖచ్చితంగా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios