వృద్ధులు, బలహీన వర్గాలకు బూస్టర్లు ఇవ్వండి : కోవిడ్ కేసుల పెరుగుద‌ల‌పై డబ్ల్యూహెచ్ వో హెచ్చ‌రిక‌లు

COVID-19 rising cases:  కోవిడ్-19 కేసులు పెరుగుద‌ల మ‌ధ్య వృద్ధులు, బలహీన వర్గాలకు (రోగ నిరోధకత తక్కువగా, దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న వారు) బూస్టర్లు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఇమ్యునైజేషన్ పై డబ్ల్యూహెచ్ వో స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశం తర్వాత ఈ వారం విడుదల చేసిన తాజా సిఫార్సు వచ్చింది.
 

Give boosters to the elderly, vulnerable: WHO warns of surge in Covid cases RMA

World Health Organization:  ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా వైరస్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో దీని వైర‌స్ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉంద‌ని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) కీల‌క సూచ‌న‌లు చేసింది. వృద్దులు, బ‌ల‌హీనంగా ఉన్న వ‌ర్గాల‌కు (రోగ నిరోధకత తక్కువగా, దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న వారు) బూస్ట‌ర్ డోసులు ఇవ్వాల‌ని పేర్కొంది. అలాగే, కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చింది. క‌రోనా వైర‌స్ కు సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ్యూహాత్మక సలహా బృంద నిపుణుల సమావేశం తర్వాత ఈ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. 

పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, ఇతర బలహీన వర్గాలకు బూస్టర్ వ్యాక్సినేషన్ల‌ను ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సిఫారసు చేసింది.  డబ్ల్యూహెచ్ వో స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (సేజ్) సమావేశం అనంతరం ఈ తాజా సిఫారసును విడుదల చేసింది. ఇన్ఫెక్షన్, వ్యాక్సినేషన్ కారణంగా ఒమిక్రాన్ ప్రభావాన్ని, అధిక జనాభా స్థాయి రోగనిరోధక శక్తిని ప్రతిబింబించేలా కోవిడ్-19 వ్యాక్సిన్ల వినియోగానికి ప్రాధాన్యమిచ్చే రోడ్ మ్యాప్ ను సైతం సవరించింది.

"జనాభాలో ఎక్కువ మంది టీకాలు వేయించుకున్నారు. అయితే, వారిలో పలువురు కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వాక్సిన్ల విషయంలో కొన్ని సవరణలు చేశాం. సవరించిన రోడ్ మ్యాప్ ఇప్ప‌టివ‌కి తీవ్రమైన వ్యాధి ప్రమాదం ఉన్నవారికి, ఎక్కువగా వృద్ధులు, అదనపు బూస్టర్లతో సహా అంతర్లీన పరిస్థితులతో ఉన్నవారికి టీకాలు వేయడం ప్రాముఖ్యతను తిరిగి నొక్కి చెబుతుంది" అని సేజ్ బృందంలోని డాక్టర్ హన్నా నోహైనెక్ ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన రోడ్ మ్యాప్ కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం మూడు ప్రాధాన్యత-వినియోగ సమూహాలను వివరిస్తుంది: అధిక, మధ్య-తక్కువ స్థాయిలుగా వ‌ర్గిక‌రించారు. ఈ ప్రాధాన్యతా సమూహాలు ప్రధానంగా తీవ్రమైన వ్యాధి, మరణ ప్రమాదంపై ఆధారపడి ఉంటాయి. అలాగే, టీకా పనితీరు, ఖర్చు-సమర్థత, ప్రోగ్రామ్ కారకాలు-సమాజ ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. ధిక ప్రాధాన్యత కలిగిన సమూహంలో వృద్ధులు ఉన్నారు. అలాగే, దీర్ఘ‌కాలిక అనారోగ్య వ్యాధుల‌తో  బాధ‌ప‌డుతున్న వారు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios