వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాల్ లో శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు జరిపిన కాల్పల్లు ఐదుగురు మృతి చెందారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు వెంటాడి కాల్చి చంపారు. 

టెక్సాస్ లోని మిడ్ లాండ్ ఒడిశా ఇన్ వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ మాసంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఆగష్టు మాసంలో ఇది రెండో ఘటన.ఆగష్టు 3వ తేదీన ఓ దుండగుడు జరిపిన కాల్పల్లో 22 మంది మృతి చెందారు., 

మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వాల్‌మార్ట్ లో చోటు చేసుకొంది.శనివారం నాడు చోటు చేసుకొన్న ఘటనపై టెక్సాస్ గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాలను ఆదుకొంటామని గవర్నర్ ప్రకటించారు,.అమెరికా కాలమానం ప్రకారంగా శనివారం మధ్యాహ్నం 3:17 గంటలకు పోలీసులు దుండగుడి కారును ఆపిన సమయంలో అతను విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ కారును ముందుకు తీసుకెళ్లాడు.

పోలీసులు నిందితుడిని వెంటాడి అతడిని కాల్చి చంపారు. అయితే నిందితుడు కారును దొంగిలించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి వయస్సు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు ప్రకటించారు.