Asianet News TeluguAsianet News Telugu

బ్రిటిష్ ఎయిర్ లైన్స్ నిర్వాకం.. శునకానికి తప్పని తిప్పలు... అమెరికాకు బదులు సౌదీ అరేబియాకు.. చివరికి...

బ్రిటిష్ ఎయిర్ లైన్స్ కార్గో తప్పిదం వల్ల ఓ శునకం తీవ్ర ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. తప్పుడు ఆడ్రస్ కు వెళ్లి మూడు రోజులు, మూడు విమానాలు మారి తన యజమానికి చేరుకోవాల్సి వచ్చింది. 
 

Familys Dog Ships To Saudi Arabia Instead Of US,  British Airline mistake
Author
First Published Dec 22, 2022, 12:22 PM IST

విమానాల్లో లగేజీ మిస్సవ్వడం.. తారుమారవ్వడం.. రాంగ్ అడ్రస్ కు చేరుకోవడం.. రోజుల తరబడి నిరీక్షణ తరువాత యజమాని దగ్గరికి తిరిగి రావడం మామూలుగా జరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా ఓ విమానయాన సంస్థ పొరపాటున ఓ కుటుంబం పెంపుడు కుక్కను యజమాని ఇంటికి కాకుండా సౌదీ అరేబియాకు పంపించింది. బ్లూబెల్ అనే ఐదేళ్ల కుక్క తన యజమాని కుటుంబంతో కలిసి నాష్‌విల్లే నుండి లండన్‌కు ప్రయాణిస్తుండగా అనుకోకుండా బ్రిటిష్ ఎయిర్‌వేస్ దాన్ని సౌదీ అరేబియాకు పంపించింది.

ఆ కుటుంబం లండన్ నుండి టేనస్సీకి షిప్ట్ అవుతున్నారు. అందుకోసం వారు తమ పెంపుడు కుక్క అయిన బ్లూబెల్‌ను బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో వెళ్లి లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో హోల్డ్‌లో వేశారు. ఆ కుటుంబం గమ్యస్థానానికి చేరుకున్న తరువాత తమ కుక్క గురించి ఎదురుచూస్తుండగా.. వారికి అది ఇంకా రాలేదు. దీంతో యజమానులైన మిల్లర్ కుటుంబీకులు ఎయిర్ లైన్స్ వారిని సంప్రదించారు. దీని గురించి కుటుంబ యజమాని మాడిసన్ మిల్లెర్ మాట్లాడుతూ ‘తమ ఐదేళ్ల వయసున్న బ్లూబెల్ నాష్‌విల్లేలో లేదని, సౌదీ అరేబియాలో ఉందని వారు అంచనాగా చెప్పారు."

19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్.. నేపాల్ కోర్టు సంచలన ఆదేశం

ఒక గంట తర్వాత, ఎయిర్‌లైన్ సిబ్బంది ఒక డబ్బాలో లాక్ చేసిన కుక్క ఫోటోను ఆమెకు పంపారు. అది బ్లూబెల్ దే అని గుర్తించడంతో ఆ కుక్క మధ్యప్రాచ్య రాజ్యంలో ఉన్నట్లు ధృవీకరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక తెలిపింది. దీంతో ఆ కుక్క తిరిగి తన యజమాని కుటుంబాన్ని కలుసుకోవడానికి మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో శునకం ట్రామాలోకి వెళ్లింది. భయంతో దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. 

మిల్లర్ కుటుంబం దీనిమీద మాట్లాడుతూ.. మూడు రోజుల తరువాత మా దగ్గరికి వచ్చిన బ్లూబెల్... మా మీద మమ్మల్ని ప్రేమతో నాకుతూ.. మా రీ యూనియన్ యూట్యూబ్ వీడియోల్లో చూపించినట్టుగా ఉంటుందనుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఉంది. మా బ్లూబెల్ పూర్తిగా మారిపోయింది. అది డబ్బాలోంచి బయటకు రావడానికి భయపడింది. మేము వెళ్లి దాన్ని దగ్గరికి తీసుకుని లాలించాల్సి వచ్చింది. అప్పుడే ఏదో తప్పు జరిగిందని మాకు తెలిసింది.. అని మిల్లర్ తెలిపారు.

ఈ ఘటన తరువాత కుక్కకు ఒత్తిడి పెరిగింది. భయం భయంగా ఉంటోంది. అప్పుడే వారికి తమ కుక్క మొదట నాష్ విల్లేకి కాకుండా సౌదీకి వెళ్లిందని.. అక్కడినుంచి చాలా గంటల ప్రయాణం తరువాత ఇక్కడికి చేరుకుందని తేలింది. దీనిమీద బ్రిటిష్ ఎయిర్‌వేస్.. ఐఏజీ కార్గో కంపెనీకి ఒక ప్రకటనలో ఇలా చెప్పింది, "బ్లూబెల్ ప్రయాణించిన మార్గం ఉండాల్సిన దానికంటే ఎక్కువ లెంథీగా ఉంది. అది లండన్ హీత్రూ విమానాశ్రయం నుండి నాష్‌విల్లేకు తిరిగి వచ్చే మొదటి విమానంలో పంపించామని మేము నిర్థారించుకున్నాం.. అన్నారు. 

కుక్క గురించి మరిన్ని వివరాలు చెబుతూ.. బ్లూబెల్ మాతో ఉన్న సమయంలో తరచుగా రిఫ్రెష్‌మెంట్‌ కు వెళ్లింది. కుక్క చాలా కంఫర్ట్ గానే జర్నీ చేసింది. ప్రయాణం పొడవునా కుక్క కాళ్లు చాపుకోవడానికి వీలైన స్థలం ఉంది.. మధ్య మధ్యలో వాకింగ్ కూడా చేయించాం. హీత్రూ యానిమల్ రిసెప్షన్ సెంటర్‌లోని బృందం ఎనిమిది గంటలు బ్లూబెల్ ను చక్కగా చూసుకున్నాయి.. అయినా కూడా కుక్క, దాని యజమానులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి వారితో సంప్రదింపులు జరుపుతూ ఉండండి" అని కోరింది. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios