జమ్మూకశ్మీర్ లో మరోసారి పాకిస్థాన్ విద్వంసం సృష్టించింది. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం పాకిస్థాన్, ఐఎస్‌ఐఎస్ జెండాలు దర్శనమిచ్చాయి. బక్రీద్ వేడుకల సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు జరిపిన అనంతరం శ్రీనగర్ వీధుల్లో పాక్, ఐసీస్ జెండాలతో ఆందోళన చేశారు. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.  మరో సంఘటనలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు  అధికారి కన్నుమూశారు.

 

మరో సంఘటనలో బుధవారం తెల్లవారుజామున షబీర్‌ అహ్మద్‌ భట్‌ అనే భాజపా కార్యకర్తను ఉగ్రవాదులు తుపాకులతో కాల్చి చంపేశారు. అతడిని ముష్కరులు మంగళవారం సాయంత్రం అపహరించారని, బుల్లెట్‌ గాయాలతో పడి ఉన్న అతడి మృతదేహం ఉదయం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. అతడిని అపహరించినప్పటి నుంచి పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది.