Asianet News TeluguAsianet News Telugu

నేపాల్ లో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదు


నేపాల్లో  ఇవాళ ఉదయంభూకంపం సంబవించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.  ఖాట్మాండ్ కు 147 కి.మీ దూరంలో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదైంది. 

Earthquake of magnitude 6.0 jolts Nepal
Author
Kathmandu, First Published Jul 31, 2022, 10:13 AM IST


ఖాట్మాండ్: Nepal  లో ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకు భూకంపం సంబవించింది.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదైంది.నేపాల్  రాజధాని Kathmandu 147 కి.మీ దూరంలోని  ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ వద్ద భూకంపం చోటు చేసుకొంది. భూకంప కేంద్రం తూర్పు నేపాల్ లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 27.14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.67 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. భూ0కంపం వచ్చిన ప్రాంతం ఇండియాలోని బీహార్ రాష్ట్రానికి సమీపంలో ఉంది. భీహార్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టుగా సమాచారం.

ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా సమాచారం అందలేదని అధికారులు ప్రకటించారు.ఇటీవల కాలంలో జరిగిన భూకంపాలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కల్గించాయి. భూకంపాలు వచ్చిన సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన  అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.

2015 ఏప్రిల్ 25న రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో భూకంపం సంబవించింది. ఖాట్మాండ్, పోఖారా నగరాల మధ్య భూకంపం వాటిల్లింది.  ఈ భూకంపం కారణంగా 8,964 మంది మరణించారు. సుమారు 22 వేల మంది గాయపడ్డారు. గోర్ఖా భూకంపం అని పిలువబడే ఈ భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలకు కూడా వ్యాపించాయి. లాహోర్, పాకిస్తాన్, టిబెట్, బంగ్లాదేశ్ లో కూడా భూమి కంపించింది.

భూకంపం కారణంగా ఖాట్మాండ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.  2015 మే 12న వచ్చిన భూకంపం కారణంగా 200 మందికి పైగా మరణించారు. ఎవరెస్ట్ పై ఉన్న మంచు కరిగి ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ భూకంపం చైనా ఎవరెస్ట్ మధ్య చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో సుమారు 2,500 మందికి పైగా గాయపడ్డారు. 1934లో అత్యంత భయంకరమైన భూకంపం వచ్చింది.రిక్టర్ స్కేల్ పై 8.0 గా భూకంప తీవ్రత నమోదైందని అధికారులు అప్పట్లో ప్రకటించారు.ఈ భూకంపం ఖాట్మాండ్, భక్తపూర్, పటాన్ నగరాలను సర్వనాశం చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios