సెంట్రల్ ఫిలిప్ఫిన్స్‌లో సోమవారం నాడు భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.
మనీలా: సెంట్రల్ ఫిలిప్ఫిన్స్‌లో సోమవారం నాడు భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.
మనీలాకు 60 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.భూకంప తీవ్రతకు పంపంగ రాష్ట్రంలో ఓ చర్చి ధ్వంసమైనట్టుగా సమాచారం అందుతోంది.
మరో వైపు ఓ పర్వతంపై ఉన్న బండరాళ్లు రహాదారికి అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారినట్టుగా అధికారులు చెబుతున్నారు. వందలాది మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుండి భయంతో పరుగులు తీశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 22, 2019, 5:22 PM IST