కాబూల్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో సోమవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. 

ఈ ఘటన కాబూల్ లోని సెంట్రల్ కాబూల్ లలో చోటు చేసుకొంది. కాబూల్ లోని గ్రీన్ విలేజ్ సమీపంలోని పలు అంతర్జాతీయ సంస్థలు ఉన్న నివాస ప్రాంతంలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

ఈ ఘటనలో ఐదుగుురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రహిమి ప్రకటించారు.

క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ప్రకటించింది.