మెక్సికో: కొవిడ్ నిరోధానికి ఫైజర్ బయోఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గత గురువారమే అంగీకరించి విషయం తెలిసిందే. దీంతో ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ఈ టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. ఇలా ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. 

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సదరు మహిళా డాక్టర్ కు మూర్చ రావడమే కాదు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం, చర్మంపై దద్దుర్లు వచ్చాయట. దీంతో ఆమెను ఐసియూలో వుంచి ప్రత్యేకంగా చికిత్స అందిస్తూనే వ్యాక్సిన్ ప్రభావంపై అద్యయనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫైజర్‌ పేరుతో అమెరికా, జపాన్‌ కు చెందిన కంపనీలు కొవిడ్‌ వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. 

ఇక ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించడం ద్వారా ప్రపంచ దేశాలు తమ వ్యాక్సిన్ డోసుల కొనుగోలు, పంపిణీని వేగవంతం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని అనుమతులిచ్చే మయంలో డబ్ల్యూహెచ్ వో తెలిపింది. బ్రిటన్, అమెరికా సహా మరో డజన్ కు పైగా దేశాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తమ సమీక్షలో తేలిందని స్పష్టం చేసింది. ఫైజర్ టీకాను అత్యంత శీతల వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో ఈ వసతులు లేని పేద దేశాలకు ఈ టీకా అందిపుచ్చుకుని పంపిణీ చేయడం పెద్ద సవాల్ గా నిలవనుంది. అయితే, అలాంటి దేశాలకు తమ సహకారం అందిస్తామని డబ్ల్యూహెచ్ వో హామీ ఇచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది.