శ్రీలంక ఆదివారం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఆరు చోట్ల ఏకకాలంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లతో 130 మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

బట్టికలోవ చర్చిలో జరిగిన పేలుళ్లలో గాయపడిన వారిని టీచింగ్ ఆసుపత్రికి తరలించగా అక్కడ రక్తం కొరత ఏర్పడింది. అదే విధంగా నెగోంబోలోని ఆసుపత్రుల్లో కూడా రక్తం కొరత ఏర్పడింది. ముఖ్యంగా ‘ఓ’ పాజిటివ్, ‘ఓ’ నెగిటివ్ గ్రూపుల రక్తం కొరత తీవ్రంగా ఉండి. దీంతో దాతలు ముందుకు రావాల్సిందిగా అధికారులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.