Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ స్టేజీ మీద నుంచి కింద పడిన వధూవరులు.. వీడియో వైరల్..!

ఒకరి కళ్లల్లో మరొకరు చూస్తూ నెమ్మదిగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. అయితే.. పొరపాటున కింద పడిపోయారు. దీంతో అతిథులు సైతం షాకయ్యారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం క్లారిటీ లేదు కానీ... దీనికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.

Bride and Groom fall on stage while dancing on their wedding day- Watch viral video
Author
Hyderabad, First Published Oct 21, 2021, 1:20 PM IST

ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే పద్దతి ప్రకారం జరిగేవి. మండపం మీద పెళ్లి జరుగుతుంటే.. వచ్చిన అతిథులంతా పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలేవాళ్లు కాదు. కానీ.. ఇప్పుడు పెళ్లి అంటే.. సంప్రదాయం కంటే ఎక్కువగా సందడికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెళ్లికి వచ్చిన బంధువుల దగ్గర నుంచి వధూ వరుల వరకు అందరూ .. డ్యాన్స్ లు వేయడం సందడి చేయడం.. ఈ మధ్యకాలంలో రీల్స్, టిక్ టాక్ లు చేయడం చాలా కామన్ అయిపోయింది.

ఈ క్రమంలో ఓ జంట కూడా పెళ్లిలో సందడి చేయాలని అనుకుంది. పెళ్లిలో డ్యాన్స్ వేశారు. అయితే.. ఈ క్రమంలో పొరపాటున కాలు జారీ.. వధూవరులు ఇద్దరూ స్టేజీ మీద నుంచి పడిపోయారు. చక్కగా.. ఇద్దరూ కొత్త దుస్తుల్లో మెరిసిపోయి ఉన్నారు.. ఒకరి కళ్లల్లో మరొకరు చూస్తూ నెమ్మదిగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. అయితే.. పొరపాటున కింద పడిపోయారు. దీంతో అతిథులు సైతం షాకయ్యారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం క్లారిటీ లేదు కానీ... దీనికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.

 

ఈ వీడియోని సదరు పెళ్లి కూతురు స్వయంగా  షేర్ చేయడం గమనార్హం.  తన భర్త బరువు, మజిల్స్, తన లెహంగా బరువు.. అన్నీ ఎక్కువగా ఉండటంతో పొరపాటున పడిపోయినట్లు ఆమె చెప్పడం గమనార్హం. అయితే కింద పడిన తర్వాత  తాను నవ్వు ఆపులేకపోయానని ఆమె చెప్పడం గమనార్హం.

ఆ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు, ఇది లక్షకు పైగా వీక్షణలు , వేలాది లైక్‌లను సంపాదించింది.

 

సంతోషకరమైన వీడియో చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు మరియు చాలా మంది సరదా స్ఫూర్తికి అందమైన జంటను ప్రశంసించారు. "ఇది తరువాతి సంవత్సరాల్లో గొప్ప జ్ఞాపకం మరియు కథ అవుతుంది" అని ఒక వినియోగదారు చెప్పారు. మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు, "నాకు ఇష్టమైనది!"

Follow Us:
Download App:
  • android
  • ios