శ్రీలంక రాజధాని కొలంబోను బాంబుల భయం వెంటాడుతూనే ఉంది. ఆదివారం వరుస పేలుళ్ల నేపథ్యంలో సైన్యం, పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొలంబో విమానాశ్రయం సమీపంలో శక్తివంతమైన బాంబును గుర్తించారు.

వెంటనే దీనిని నిర్వీర్యం చేయడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. ఆదివారం చర్చ్‌లు, హోటళ్లను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లలో 290 మంది మరణించగా, 500 మంది వరకు గాయపడ్డారు.