హాంకాంగ్ లోని కొలీజియంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టేజ్ పై ఓ గ్రూప్ డ్యాన్స్ చేస్తుండగా పై నుంచి ఒక ఎల్ఈడీ స్క్రీన్ వచ్చి డ్యాన్సర్ లపై పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
హాంకాంగ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఇక్కడి కొలీజియంలో జరిగిన ‘బాయ్ బ్యాండ్ మిర్రర్’ కచేరీ సందర్భంగా ఓ పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ అక్కడ డ్యాన్స్ చేస్తున్న వారిపై ఊడిపడింది. ఇది ఒక్క సారిగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు డ్యాన్సర్ లకు గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలతో ఉన్నారు. ఒక్క సారిగా ఇలా జరగడంతో ఈ ప్రోగ్రామ్ ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదం సందర్భంగా ముగ్గురు ప్రేక్షకులు కూడా గాయపడ్డారని హాంకాంగ్ మీడియా నివేదించింది.
Viral Video: కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే.. గాడిదే కదా అని తన్నాడు.. చివరకు..!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్యాన్సర్లను, ఉద్యోగులను, సాధారణ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని అన్నారు.
విక్టోరియా హార్బర్‌కు సమీపంలో ఉన్న హాంకాంగ్ కొలీజియంలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ కచేరీ సందర్భంగా దాదాపు 15 మంది డ్యాన్సర్ లు పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. వారి స్టేజ్ కు పైన ఉన్న ఒక పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ మెల్లగా వచ్చి కింద పడింది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ఒక డ్యానర్ పై ఇది పడింది. దీనిని చూసిన ప్రేక్షకులు అందరూ ఒక్ సారిగా షాక్ కు గురయ్యారు. అరవడం మొదలు పెట్టారు. మిగితా అందరు డ్యాన్సర్ లు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. స్క్రీన్ ని బయటకు తీశారు. గాయపడిన ఇద్దరు డ్యాన్సర్లను క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇరాన్‌లో పెరుగుతున్న మరణ శిక్షలు.. ఒక్క రోజులో ముగ్గురు మహిళలకు ఉరి.. వారు చేసిన నేరం ఏంటంటే?
మొత్తంగా ఈ వేధికపై ఇంకా 12 పర్ఫామెన్ లు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని నిర్ణయించారు. స్టేజ్ నిర్మాణం సేఫ్టీగా ఉందని స్పష్టం అయ్యే వరకు మిగితా పర్ఫామెన్ లు నిలిపి వేస్తున్నామని కల్చలర్ సెక్రటరీ కెవిన్ యెంగ్ తెలిపారు. కాగా.. ‘మిర్రర్ బ్యాండ్’ కార్యక్రమంలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు కూడా ఒక సారి కూడా ఒక డ్యాన్సర్ స్టేజీ పై నుంచి పడిపోయాడు. ఇందులో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రేక్షకులకు ఎలాంటి గాయాలు కాలేదు.
