లాస్ఏంజెల్స్: ఉత్తర కాలిఫోర్నియా సమీపంలోని శాంటాక్రూజ్ దీవి తీర ప్రాంతంలో సముద్రంలో పడవ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా,
మరో 33 గల్లంతైనట్టుగా అమెరికా ప్రకటించింది.

సముద్ర తీరానికి 20 కి.మీ దూరంలో స్కూబా డైవ్ చేసే వాణిజ్య పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆరుగురిని రక్షించారు. మిగిలిన 33 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అమెరికా కాలమానం ప్రకారంగా సోమవారం తెల్లవారుజామున 3;30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది. 

పడవలో ఎంతమంది ఉన్నారు.. ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది తప్పించుకొన్నారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గల్లంతైన వారు తప్పించుకొన్నారా... లేదా సముద్రంలో కొట్టుకుపోయారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.