బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. సాపాలో రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్ టైల్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను బయటకు తీసి.. గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా పట్టణంలో మూడు రోజులు సంతాపాన్ని ప్రకటించారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలపై విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.