మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు.

మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు.ఈ మేరకు స్థానిక పురపాలక అధికారులు వివరాలు వెల్లడించారు. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుందని చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:18 గంటలకు( 21: 18 జీఎంటీ) పొడవాటి తుపాకీలతో ఉన్న వ్యక్తులు బూడిద రంగు వ్యాన్ నుండి దిగి గ్యాస్ స్టేషన్‌ వద్ద పార్టిసిపెంట్స్‌పై కాల్పులు జరిపినట్టుగా అక్కడివారు 911‌కు కాల్ చేసి అధికారులకు సమాచారం అందించారు. 

దీంతో మునిసిపల్, రాష్ట్ర పోలీసులు, మెరైన్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, మెక్సికన్ రెడ్‌క్రాస్, ఇతర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి.. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ఇక, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర అటార్నీ జనరల్ రికార్డో ఇవాన్ కార్పియో సాంచెజ్ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు మేయర్ అర్మాండో అయాలా రోబుల్స్ తెలిపారు.

ఇక, సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన వీడియోల ప్రకారం.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరళగోళం నెలకొంది. తుపాకీ కాల్పుల శబ్దాలతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో పాటు భయంతో పెద్దగా అరవడం కనిపించింది.