Asianet News TeluguAsianet News Telugu

బిడ్డ ఏడుపు వినలేక ఆతల్లి ఏం చేసిందంటే....

ముక్కుపచ్చలారని పిల్లాడు. బాధ అయినా ఆకలి అయినా ఏదైనా నోరుతో చెప్పలేని పసివాడు. అమ్మా ఆకలి అమ్మా కడుపు నొప్పి అంటూ నోరు విప్పి చెప్పలేని పసిప్రాయం. అయితే ఆ ఏడుపే ఓ చిన్నారి పాలిట యమశాపంలా మారింది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించాల్సిన తల్లి ఆ బిడ్డనే కడతేర్చింది.

Arizona: 19-year-old mother drowns baby in bathtub, had searched for how to kill babies on internet
Author
Washington, First Published Oct 27, 2018, 8:08 PM IST

వాషింగ్టన్‌ :ముక్కుపచ్చలారని పిల్లాడు. బాధ అయినా ఆకలి అయినా ఏదైనా నోరుతో చెప్పలేని పసివాడు. అమ్మా ఆకలి అమ్మా కడుపు నొప్పి అంటూ నోరు విప్పి చెప్పలేని పసిప్రాయం. అయితే ఆ ఏడుపే ఓ చిన్నారి పాలిట యమశాపంలా మారింది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించాల్సిన తల్లి ఆ బిడ్డనే కడతేర్చింది. ఏడుపు విని తట్టుకోలేక అత్యంత దారుణంగా చంపేసింది. విషాదమేంటంటే ఇంటర్నెట్‌లో వెతికి మరి బిడ్డను చంపింది ఆ తల్లి. ఈ హృదయ విదారకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.  

వాషింగ్టన్ కు చెందిన అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టావశాత్తు ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడు. అనారోగ్యం కారణంగా పసికందు నిత్యం ఏడుస్తూనే ఉన్నాడు. నెలరోజులపాటు విపరీతంగా ఏడుస్తున్నాడు. 

బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడో...బాధతో ఏడుస్తున్నాడో అని తెలుసుకోవాల్సిన ఆ మాతృమూర్తి కర్కశంగా తయారైంది. పిల్లాడ్ని సముదాయించాల్సింది పోయి ఆ చిన్నారి ఏడుపు వినలేక బాత్‌టబ్‌లో ముంచి చంపేసింది. ఆ తర్వాత ఆ పసివాడి మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ బ్యాగ్ లో కుక్కి సమీపంలోని పార్క్‌లో వదిలేసి వచ్చింది. 

తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫోన్‌ లో ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తల్లి అరిజోనాపైనే ప్రశ్నల వర్షం కురిపించారు.

అరిజోనా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది పోలీసులకు. తమదైన స్టైల్ లో విచారించేసరికి తన కుమారుడు నీళ్లతొట్టిలో పడి చనిపోయాడని బుకాయించింది. నెలరోజుల పసికందు నీటితొట్టిలోకి ఎలా జారిపోతాడని అనుమానించిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. 

తీగలాగితే డొంక కదిలినట్లు ఆమె సెల్‌ఫోన్‌ పరిశీలించిన పోలీసులకు అరిజోనానే హంతకురాలని గుర్తించారు. పసికందును చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్‌లో అనుమానం రాకుండా చంపడం ఎలా కేసు నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటి అనే అంశాలపై సెర్చ్ చేసింది. ఇంటర్నెట్ లో చూపించినట్లు ఆ బాలుడిని బాత్ టబ్ లో వేసి చంపేసింది.

నెలరోజులుగా కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్‌టబ్‌లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది. ఏ అచ్చటా.. ముచ్చటా చూడకుండానే నా కొడుకు లోకాన్నివిడిచివెళ్లిపోయాడు అంటూ తండ్రి బోరున విలపించాడు. ఈ నేరం చేసిన నా భార్యను జీవితాంతం జైలులోనే ఉంచాలని పోలీసులకు చెప్పాడు. అప్పుడే ఆమెకు నా బిడ్డ పడిన వేధన అర్థమవుతుంది అంటూ చిన్నారి తండ్రి పోలీసులను కోరాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios