శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇప్పటికే ఆదివారం ఉదయం చర్చిలు, హోటళ్లను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు ఆరు చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారు.

తాజాగా మధ్యాహ్నం మరోసారి నగరంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. దేహివాలా జూ సమీపంలో బాంబు పేలినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.