Monkeypox: రోజురోజుకూ మంకీపాక్స్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. 20 రోజుల్లో 27 దేశాలలోవ్యాప్తించి 780 మందికి సోకింది. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో ఈ వ్యాధి కేసులు నమోదు కానప్పటికీ.. WHO తాజా గణాంకాలు భయానకంగా ఉన్నాయి.
Monkeypox: కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాకముందే.. మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అదే మంకీపాక్స్.. ఈ కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శరవేగంగా విభృంభిస్తూ..మానవాళి గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో 7 వందలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా.. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తుంది. తాజాగా వెలువర్చిన నివేదికలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి.
WHO తాజా గణాంకాల ప్రకారం.. గత 20 రోజుల్లో 27 దేశాలలో వ్యాపించింది. అదే సమయంలో.. 780 మందికి ఈ వ్యాధి సోకినట్టు వెల్లడించింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ వైరస్ ఇప్పుడు ప్రజల ప్రాణాలను తీయడం ప్రారంభించింది. కాంగోలో తొమ్మిది మంది మంకీపాక్స్‌తో మరణించగా, నైజీరియా మొదటి మరణం నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో సహా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రధాన ఆరోగ్య సంస్థలు మంకీపాక్స్ కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశాయి. WHO ఈ వ్యాధిని తీవ్రంగా పరిగణించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బలమైన చర్య తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఈ వైరస్ ప్రారంభ దశలో ఉందని, దీన్ని అరికట్టడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయడం చాలా ముఖ్యం అని సంస్థ తెలిపింది.
WHO అధికారిణి మరియా వాన్ కార్ఖేవ్ మాట్లాడుతూ.. అది ఏలా వ్యాప్తి చెందుతుంది. అనే అంశాలపై పౌరుల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు. దీంతో పాటు నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేయాలనీ, ముఖ్యంగా మంకీపాక్స్ గురించి అవగాహన లేని దేశాలలో స్థానిక వైద్య వ్యవస్థలు దీనిని సకాలంలో గుర్తించే విధంగా సరైన చికిత్స అందించేవిధంగా అవసరమని తెలిపారు. నివారణ చర్యలు తదితర అంశాలపై పెంచాలని, ఆ దిశగా నివారణ చర్యలను ప్రతిపాదించారు.
భారత ప్రభుత్వ మార్గదర్శకాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మే 31న మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే.. కాస్త ఉపశమనం కల్గించే విషమేమింటంటే.. ఇప్పటి వరకు భారత్ లో ఈ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తిని 21 రోజుల పాటు పర్యవేక్షిస్తారని మంత్రిత్వ శాఖ మార్గదర్శకంలో పేర్కొంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఎవరిలోనైనా.. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే... వారి నమూనాలను ల్యాబ్‌కు తరలించాలని తర్వాత, మంకీపాక్స్ కేసు ధృవీకరించబడినట్లు పరిగణించబడుతుంది. మంకీపాక్స్‌కు PCR లేదా DNA పరీక్ష మాత్రమే చెల్లుబాటు అవుతుందని మార్గదర్శకంలో కూడా చెప్పబడింది.
మంకీపాక్స్ సంక్రమణ కారణాలు ?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంకీపాక్స్ అనేది వైరస్ వల్ల సోకుతుంది. ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ సమూహానికి చెందినది. ఈ గుంపులోని ఇతర వైరస్ లు మానవులలో మశూచి, కౌపాక్స్ వంటి ఇన్ఫెక్షన్‌లను కలిగిస్తాయి. WHO ప్రకారం.. ఒక వ్యక్తి నుండి మరొకరికి మంకీపాక్స్ సోకిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ము, దగ్గు నుండి విడుదలయ్యే తుంపర్లలో.. వ్యాధి సోకిన వ్యక్తి చర్మపు పుండ్ల నుంచి లేదా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వలన ఇతర వ్యక్తులకు సంక్రమణ సంక్రమించే అవకాశం ఉంది.
