Asianet News TeluguAsianet News Telugu

నడి సముద్రంలో ఐదేళ్ల పిల్లాడిని వదిలేసిన తండ్రి.. నెటిజన్లు సీరియస్..!

ఎలాగోలా పట్టుకొని పైకి వచ్చాడు. దానికి తోడు ఆ బాలుడికి పెద్ద షార్క్ కూడా కనపడింది. ఆ షార్క్ బాలుడిని చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే దానికి ఆహారం అయ్యేవాడు.

5-year-old sees shark while surfing with his dad in viral video ram
Author
First Published May 23, 2023, 10:39 AM IST

పిల్లలను బీచ్ లాంటి ప్రదేశాలకు తీసుకువెళ్లినప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడిని నడి సముద్రంలో వదిలేశాడు. సర్ఫింగ్ కి తీసుకువెళ్లి బాలుడిని తన మానాన తానని వదిలేశాడు. కొద్దిలో మిస్ అయ్యింది లేకపోతే, ఆ బాలుడు షార్క్ కి ఆహారమయ్యేవాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా, ఆ బాలుడి తండ్రిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇంత దారుణంగా ఏ తండ్రి అయినా ప్రవర్తిస్తాడా అంటూ తిట్టిపోస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వీడియోలో తండ్రి, కొడుకు సర్ఫింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. ఆ బాలుడి వయసు ఐదేళ్లు  కావడం గమనార్హం. బాలుడిని అలా వదిలేసి అతను తన సర్ఫింగ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో బాలుడు ముందు వెళ్లిపోయాడు. మధ్యలో ఆ బాలుడి జారి నీటిలోకి కూడా పడబోయాడు. ఎలాగోలా పట్టుకొని పైకి వచ్చాడు. దానికి తోడు ఆ బాలుడికి పెద్ద షార్క్ కూడా కనపడింది. ఆ షార్క్ బాలుడిని చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే దానికి ఆహారం అయ్యేవాడు.

ఆ తర్వాత కూడా బాలుడు తాను పెద్ద జంతువును చూశాను అని చెబుతున్నా కూడా ఆ తండ్రి కనీసం పట్టించుకోలేదు. అది చేప అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. నిర్లక్ష్యంగా నవ్వాడు. అతని నిర్లక్ష్య ధోరణి చూసి నెటిజన్లకు కాలిపోయింది. విపరీతంగా తిట్టిపోస్తున్నారు. కాగా, ఈ వీడియోకి దాదాపు 7 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios