Asianet News TeluguAsianet News Telugu

Building Dubai Expo:ముగ్గురు మృతి, 70 మందికి గాయాలు

దుబాయ్ ఎక్స్‌పో 2020 భవన నిర్మాణంలో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు.ఈ ఎక్స్‌పో ను యూరోపియన్ పార్లమెంట్ బహిష్కరించినట్టుగా ప్రకటించిన తర్వాత నిర్వాహకులు ఈ మేరకు నివేదికను విడుదల చేశారు.  శనివారం నాడు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎక్స్ పో సైట్ ను సందర్శించారు.

3 Workers Died, More Than 70 Injured Building Dubai Expo: Officials
Author
Dubai - United Arab Emirates, First Published Oct 3, 2021, 10:53 AM IST

దుబాయ్: దుబాయ్ ఎక్స్‌పో-2020  (dubai expo) సైట్ లో ముగ్గురు కార్మికులు (three dead)మరణించారు. మరో 70 (70 injured) మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  (uae)మానవ హక్కుల రికార్డు గణాంకాలు వెల్లడయ్యాయి. ఆరు మాసాల పాటు జరిగే ప్రపంచ ప్రదర్శనను బహిష్కరించాలని యూరోపియన్ పార్లమెంట్ (European parliament) పిలుపునిచ్చిన తర్వాత ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

రెండు లక్షల మంది కంటే ఎక్కువ మంది కార్మికులు దుబాయ్ శివార్లలో భారీ సైట్ ను నిర్మించారు. యూఎఈ, ఖతార్ వచ్చే ఏడాది ప్రపంచకప్‌కి అతిథ్యమిస్తున్నాయి. దీంతో దక్షిణాసియా దేశాల నుండి వచ్చిన కార్మికుల పట్ల అనుసరిస్తున్న తీరుపై హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇప్పటి వరకు దురదృష్టవశాత్తు ముగ్గురు కార్మికులు మరణించారు. సుమారు 72 మంది తీవ్రంగా గాయపడ్డారని ఎక్స్‌పో ఓ ప్రకటనలో తెలిపింది. కార్మికుల సంక్షేమానికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించింది.ఈ సైట్‌లో 247 మిలియన్ పని గంటలు పూర్తయ్యాయని ప్రకటించింది. అయితే బ్రిటన్ కంటే ప్రమాదాల స్థాయి తక్కువగా ఉందని  ఎక్స్‌పో తేల్చి చెప్పింది.

ఎక్స్‌పో 2020 దుబాయ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత కోసం ప్రపంచస్థాయి విధానాలు, ప్రమాణాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది.శనివారం నాడు ఎక్స్‌పో ను ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ లే డ్రియాన్ సందర్శించారు. యూరోపియన్ పార్లమెంట్ తీర్మానంలో ఫ్రాన్స్ భాగస్వామ్యం కాదని తేల్చి చెప్పారు.యూఏఈతో తమ సంబంధం ఒక వ్యూహాత్మకమైందని ఫ్రాన్స్ తెలిపింది. తాము యూఏఈ ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకొంటే  బహిరంగంగా కాకుండా వారికి మాత్రమే చెబుతామని డ్రియాన్ మీడియాకు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios