Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. స్కూల్లో 15యేళ్ల విద్యార్థి కాల్పులు.. 3గురు మృతి, 8 మందికి గాయాలు

ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో తరగతులు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడితో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని ఓక్‌లాండ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. మృతులు 16 ఏళ్ల పురుషుడు, 14 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
 

3 students killed and 8 injured in US school shooting
Author
Hyderabad, First Published Dec 1, 2021, 8:12 AM IST

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. మిచిగాన్ హైస్కూల్‌లో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి మంగళవారం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు టీనేజర్లు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఆ తరువాత ఆ విద్యార్థి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు  US పాఠశాల జరిగిన కాల్పుల్లో ఇది అత్యంత ఘోరమైనది.

ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో తరగతులు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడితో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని ఓక్‌లాండ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. మృతులు 16 ఏళ్ల పురుషుడు, 14 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

క్షతగాత్రులలో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరికి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సెమీ ఆటోమేటిక్ చేతి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు, అయితే డెట్రాయిట్‌కు ఉత్తరాన 40 మైళ్ల (65 కిలోమీటర్లు) దూరంలో ఉన్న ఈ చిన్న ఆక్స్‌ఫర్డ్ అనే పట్టణంలో దాడి జరగడానికి ఎలాంటి కారణాలున్నాయనేది ఇంకా తెలియరాలేదు. 

అనుమానితుడిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఎలాంటి ప్రతిఘటన చేయలేదని పోలీసులు తెలిపారు. అతను తనకు లాయర్ కావాలని అడిగాడు. అంతేకానీ కాల్పులకు గల కారణాలు తెలుపలేదు.. అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది. అయితే ఈ ఘటన "ఇది చాలా విషాదకరమైనది" అని అండర్‌షరీఫ్ మైఖేల్ మెక్‌కేబ్ విలేకరులతో అన్నారు.

"ప్రస్తుతం ముగ్గురు మరణించడం మమ్మల్ని చాలా బాధిస్తుంది. వీరంతా విద్యార్థులేనని అనుకుంటున్నాం’ అన్నారు. అంతేకాదు ఈ ఘటనతో ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కూడా ఆయన అన్నారు. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత పోలీసులకు 100 911 పైగా emergency callsలు వచ్చాయని, ఐదు నిమిషాల వ్యవధిలో షూటర్ 15-20 రౌండ్ల కాల్పులు జరిపాడని మెక్‌కేబ్ చెప్పారు. మొదటి 911 కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

షాకింగ్...

మిన్నెసోటా పర్యటనలో ఉన్న అధ్యక్షుడు జో బిడెన్‌కు కాల్పులు సమాచారం షాక్ కలిగించిందని అన్నారు. "ప్రియమైన వ్యక్తులను కోల్పోయి, ఊహించలేని దుఃఖాన్ని భరిస్తున్న కుటుంబాలకు నా హృదయ పూర్వక సంతాపం" అని అతను చెప్పాడు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మొత్తం జనాభా ప్రస్తుతం షాక్ స్థితిలో ఉందని అన్నారు. పోలీసులు అనుమానితుడి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారని వారి ఇంటిని శోధించారని మెక్‌కేబ్ చెప్పారు. ఘటన జరిగిన రోజు అనుమానితుడు తరగతిలోనే ఉన్నాడు. ఒంటరిగానే దాడి చేసినట్లు కనిపించాడు.

400 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ దేశంగా బార్బడోస్ అవతరణ.. నేషనల్ హీరోగా రిహానా

బాధితులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారా లేదా యాదృచ్ఛికంగా కాల్చి చంపారా అనేది తెలియాల్సి ఉందని మెక్కేబ్ అన్నారు. నిందితుడు అస్సలు ఏమీ మాట్లాడడం లేదని ఆయన విలేకరులతో అన్నారు. దాదాపు 1,800 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో పోలీసులు జరిగిన సన్నివేశాన్ని పరిశోధిస్తున్నారని, అనుమానితుడి గురించి ఏదైనా సమాచారం తెలిసిన వారిని ఇంటర్వ్యూ చేయాలని మెక్‌కేబ్ చెప్పారు.

"ఇది ప్రతి తల్లిదండ్రులకు సంబంధించి చెత్త పీడకల అని నేను భావిస్తున్నాను" అని మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ అదే విలేకరుల సమావేశంలో అన్నారు.

ఇది ప్రత్యేకమైన అమెరికన్ సమస్య..

ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ, సామూహిక కాల్పులు, తుపాకీ నియంత్రణ కోసం లాబీల గణాంకాలను తేల్చే గ్రూప్ ల ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనల్లో అత్యంత ఘోరమైనది ఇది. మంగళవారం నాటి సంఘటనకు ముందు, ఎవ్రీటౌన్ అందించిన గణాంకాల ప్రకారం, 2021లో యునైటెడ్ స్టేట్స్‌లోని పాఠశాలల్లో 138 కాల్పులు జరిగాయి.

ఆ సంఘటనలలో, 26 మంది మరణించారు. అయితే ప్రతిసారీ రెండు కంటే ఎక్కువ కాదు. దేశంలో సామూహిక కాల్పుల అంటువ్యాధి గురించి అడిగినప్పుడు,"ఇది మేం సత్వరమే పరిష్కరించాల్సిన ఏకైక అమెరికన్ సమస్య." అని విట్మెర్ బదులిచ్చారు.

US చరిత్రలో అత్యంత ఘోరమైన పాఠశాలలో కాల్పులు ఘటన ఏప్రిల్ 2007లో వర్జీనియాలోని బ్లాక్స్‌బర్గ్‌లోని వర్జీనియా టెక్ వద్ద జరిగిన దాడి, ఇందులో షూటర్‌తో సహా 33 మంది మరణించారు, ఆ తర్వాత డిసెంబర్ 2012లో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లోని శాండీ హుక్ ప్రాథమిక పాఠశాలపై దాడి జరిగింది,  20 మంది పిల్లలు, షూటర్‌తో సహా 28 మంది మరణించారు.

ఫిబ్రవరి 2018లో, ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లోని అత్యంత ఘోరమైన హైస్కూల్ కాల్పుల్లో ఓ వ్యక్తి తన మాజీ పాఠశాలలో AR-15 అసాల్ట్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో, 17 మందిని చంపి, తనూ మరణించారు.

మామ్స్ డిమాండ్ యాక్షన్ గ్రూప్ వ్యవస్థాపకుడు షానన్ వాట్స్, తుపాకీలను నియంత్రించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు, దేశవ్యాప్తంగా పౌరుల వద్ద 400 మిలియన్ తుపాకులు ఉన్నాయని చెప్పారు. "మరిన్ని తుపాకులు మనల్ని సురక్షితంగా మార్చినట్లయితే, మేం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం అవుతాం" అని వాట్స్ ట్విట్టర్‌లో రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios