ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 24 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరీకార్‌లో మంగళవారం ఆఫ్గన్ ప్రధాని అష్రఫ్ ఘనీ ప్రచారం నిర్వహించారు.

ఈ సమయంలో ఉగ్రవాదులు ప్రచార కార్యక్రమం ప్రధాన ద్వారం వద్ద పేలుడు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రధాని ప్రచార ర్యాలీలో మరో బాంబు పేల్చారు.

ఈ సమయంలో ఘనీ అక్కడే ఉన్నారు.. అయితే ఆయన ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకోగా.. 24 మంది పౌరులు మరణించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజధాని కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది.

గ్రీన్ జోన్‌గా పిలిచే ఈ ప్రాంతంలోనే రక్షణ మంత్రిత్వశాఖ, అమెరికా రాయబార కార్యాలయం, నాటో కార్యాలయం వంటివి ఉన్నాయి. కాగా ఆఫ్గాన్ ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.