ఇద్దరు మైనర్ పిల్లలు.. చక్కగా స్కూల్ కి వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో 9మంది హత్య చేసేందుకు కుట్ర పన్నారు. చివరకు మీడియా ద్వారా బయటకు లీకై.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సౌత్ ఆర్లాండోకి 74మైళ్ల దూరంలో ఉన్న ఎనోవ్ పార్క్ మిడిల్ స్కూలో చదివే ఇద్దరు మైనర్ బాలికలు రహస్యంగా మాట్లాడుకోవడం ఓ టీచర్ గమనించింది. అనుమానం వచ్చి వాళ్ల చేతుల్లో ఉన్న ఓ ఫోల్డర్ ని తీసుకుంది. దాని మీద ప్రైవేట్ ఇన్ఫో.. ఎవ్వరూ ఓపెన్ చేయవద్దని ఉంది. 

టీచర్ ఓ పెన్ చేసి చూడగా.. ప్రాజెక్ట్ 11\9 అనే టైటిల్‌తో ఒక భారీ స్కెచ్ గురించిన డీటెయిల్స్ వున్నాయందులో. వెంటనే షాక్ అయిందామె.ఏదో ప్రాంక్ ఏమో అనుకొని వదిలేసింది. 

అందులో ‘ తుపాకీలు ఎలా సంపాదించాలి, తొమ్మిది మందిని ఎలా చంపాలి, శవాలను ఎలా మాయం చేయాలి’ తదితర విషయాలకు సంబంధించి సమాచారాన్ని ఆ బాలికలు సేకరించారు.  ఈ విషయం మీడియాకు ఎలా తెలిసిందో... టీవీలో ప్రసారం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికలను     అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలు కావడంతో జువైనల్ కోర్టుకు తరలించారు.