బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ లోని సీతకుంట సమీపంలో ప్రైవేట్ కంటైనర్ డిపోలో ఆదివారం నాడు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. 450 మంది గాయపడ్డారు.
ఢాకా: Bangladesh లోని Chittagongలోని Sitakunda సమీపంలోని ప్రైవేట్ కంటైనర్ డిపోలో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. మరో 450 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కడమ్‌రసూల్ ప్రాంతంలోని BM Container Depot డిపోలో మంటలు వ్యాప్తి చెందాయని చిట్టగాంగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోలీస్ ఔట్ పోస్టు ఎస్ఐ నూరుల్ ఆలం చెప్పారు.
కంటైనర్ డిపోలో రసాయనాల కారణంగా Fire accident తో మంంటలు చెలరేగాయని అధికారులు అనుమానిస్తున్నారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే సమయంలో భారీ పేలుడు కూడా చోటు చేసుకొంది. పేలుడు తర్వాత మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
శవివారం నాడు రాత్రి చెలరేగిన మంటలు ఆదివారం నాడు తెల్లవారుజాము వరకు కొనసాగినట్టుగా ఎస్ఐ నూరుల్ ఆలం తెలిపారు. ఆదివారం నాడు తెల్లవారుజామున భారీ పేలుడు కూడా చోటు చేసుకొందని ఆయన వివరించారు. ఒక కంటైనర్ లోని మంటలు మరో కంటైనర్ లోకి మంటలు వ్యాప్తి చెందాయని ఎస్ఐ తెలిపారు.
ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్టుగా చిట్టగాంగ్ లోని హెల్త్ సర్వీస్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లాం బంగ్లాదేశ్ స్థానిక మీడియాకు ధృవీకరించారు. ఈ ఘటనలో 450 మంది గాయపడ్డారు. సుమారు 350 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. పలువురి ఇళ్ల కిటీల అద్దాలు పగిలిపోయాయి. సుమారు 1`9 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని చిట్టగాంగ్ ఫైర్ సర్వీస్ , సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎండీ ఫరూక్ చెప్పారు.
ఢాకాకు ఆగ్నేయంగా 242 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ముగ్గురు చికిత్స పొందుతూ మరణించినట్టుగా చిట్టగాంగ్ జిల్లా ఎస్పీ రషీదుల్ హక్ మీడియాకు తెలిపారు.చాలామంది ఈ ఘటనలో గాయపడ్డారని ఆయన చెప్పారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషంగా ఉందన్నారు.
