మాల్దీవుల రాజధాని మాలెలో గురువారంనాడు జరిగిన  అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది భారతీయులున్నారు.

మాలె: మాల్దీవుల రాజధాని మాలేలో గురువారంనాడు జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది భారతీయులున్నారు.వలస కార్మికులు నివసించే భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భవనం పై అంతస్తు నుండి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో వాహనాల మరమ్మత్తు గ్యారేజీ ఉంది .ఇక్కడి నుండే మంటలు వ్యాపించినట్టుగా సమాచారం.ఈ మంటలను ఆర్పేందుకు సుమారు నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారు.ఈ విషయమై సహాయం కోసం 960736145 లేదా 9607790701 నెంబర్లలో సంప్రదించాలని భారత హై కమిషనర్ కార్యాలయం తెలిపింది.