#Samantha:సమంత డెసిషన్స్ వెనుక... గాడ్ ఫాదర్ ?


 నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక  సమంత కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకుంటోంది. తన కెరీర్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది. అలాగే తన కొత్త జీవితంపై పాత నీడలు పడకూడదని, పాత టాపిక్ లు మాట్లాడుకోకూడదని..అందుకోసం ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం.

 Who is behind  Samantha To settle in  Mumbai


నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేశావె చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై అందర్నీ తన మాయలో పడేసింది సమంత. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకుని వరుస ఆఫర్లతో తెలుగులో  నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దంపైన గడుస్తున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా ఉన్న టైమ్‌లోనే నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. నిజమైన కారణాలు ఏమిటో తెలియదు కానీ, కొన్ని మనస్పర్థల వలన ఈ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గత ఏడాది విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పేసారు.

అయితే సమంత అప్పటి నుంచి ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది. బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. తన కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగా హిందీలో ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. అలాగే అక్కడే యాడ్స్, ఫోటోషూట్స్, మ్యాగజైన్ కవర్స్, ఫ్రెండ్స్… ఇలా ఎక్కువగా ముంబై లోనే ఆమె ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తోంది.    దాంతో, ఆమె ముంబైలోనే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ కి అప్పుడప్పుడు మాత్రమే వస్తోందని వినికిడి. ఈ క్రమంలో ముంబైలో ఓ ఇల్లు కొనుక్కోబోతోందని తెలుస్తోంది. ఆ ఇంటి రేటు 30 కోట్లు అని అంటున్నారు. 

ప్రస్తుతం బేర సారాలు జరుగుతున్నాయట. త్వరలోనే సమంత ముంబై ఇంటి వార్త అఫీషియల్ గా వింటాము. ఇక ఇలా సమంత బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి..అక్కడ ఇల్లు తీసుకుని సెటిల్ అవ్వాలనే ఆలోచన వెనక ....ఎవరో గాఢ్ ఫాధర్ ఉన్నారని సోషల్ మీడియా అంటోంది. బాలీవుడ్ లోని స్నేహితుల సపోర్ట్ తోనే ఆమె మకాం షిప్ట్ చేస్తోందని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదు..కేవలం ఫ్యామిలీ సపోర్ట్ తోనే సమంత ముందుకు వెళ్లోందని సన్నిహితులు అంటున్నారు.

 ఇక నాగ‌చైత‌న్య‌తో విడాకులు అయ్యాక గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే కెరీర్ ను స్టార్ట్ చేసింది. టాలీవుడ్,కోలివుడ్ ఇండ‌స్ట్రీల‌లో పెద్ద పెద్ద హీరోల‌తో న‌టిస్తూ,ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతు,త‌గ్గేదేలే అంటుంది స‌మంత‌. ఈ మ‌ధ్య బాగా పాపుల‌ర్ అయిన‌`పుష్ప‌`సినిమాలో `ఊ అంటావా మావ ,ఊఊ అంటావ మావ‌`పాట‌తో అంద‌రిని ఒక ఊపు ఊపేసింది. ఇటీవ‌ల కోలివుడ్ లో వ‌చ్చిన `కాతువాకుల రెండు కాద‌ల్`సినిమాలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించింది సమంత. కోలివుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టిస్తున్న‌ 67 వ చిత్రంలో స‌మంత‌ను తీసుకుంటున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios