Vijay Deverakonda:శివనిర్వాణకు విజయ్ దేవరకొండ షరతు,ఇరుకునపెట్టినట్లే?

శివ నిర్వాణ దర్శకత్వంలో  రూపొందనున్న  సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ఆరంభం కానుందని, ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన సమంత నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.కశ్మీర్‌ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అని సమాచారం.

Vijay Deverakonda next in four months!


విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక లైగర్‌ షూటింగ్‌ అనంతరం విజయ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. లైగర్ చిత్రానికి బాగా ఎక్కువ సమయం తీసుకోవటంతో ఈ సినిమాని కేవలం నాలుగు లేదా ఐదు నెలల్లో పూర్తి చేయాలని విజయ్ దేవరకొండ దర్శకుడుకి కండీషన్ పెట్టారని సమాచారం. మైత్రీమూవీస్ వారు ఈ సినిమా నిర్మించనున్నారు.

మళ్లీ ఈ చిత్రం తర్వాత పూరితోనే సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు బాగా టైమ్ పట్టనుందని సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో  రూపొందనున్న  సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ఆరంభం కానుందని, ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన సమంత నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.కశ్మీర్‌ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అని సమాచారం. నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన ఈ డైరెక్ట‌ర్ మూడో చిత్రంగా నానితో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ సినిమా చేశారు. ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుద‌లైంది. అయితే ఆశినంత హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేక‌పోయింది. 

పూరి చిత్రం విషయానికి వస్తే...విజయ్‌ దేవరకొండ ఇందులో మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని భోగట్టా. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘లైగర్’ పాన్ ఇండియా రేంజ‌లో విడుదలవుతుంది. మరి శివ నిర్వాణతో మన రౌడీ స్టార్ పాన్ ఇండియా సినిమాను చేస్తారా? లేక టాలీవుడ్‌కి సంబంధించిన సినిమానే చేస్తారా అని తెలియడం లేదు. మరో వైపు పూరీ జగన్నాథ్ తర్వాత విజయ్ దేవరకొండ కోసం మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెయిట్ చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios