#Liger:‘లైగర్’న ష్టం ..దిల్ రాజు ఆ రకంగా సెటిల్మెంట్ ? పాపం పూరి


పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’(Jana Gana Mana) అఫీషియల్ గా ఆగిపోయిన సంగతి తెలిసిందే.   ఇప్పుడా డేట్స్ ని విజయ్ దేవరకొండ ఎవరికి ఇవ్వబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 
 

Vijay Devarakonda And Harish Shankar movie on cards..?


'జనగణమన' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పుడు రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. వీరితో రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు 'లైగర్' సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసారనే వార్తలు వస్తున్నాయి.పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీనికి ఛార్మి కౌర్ - దర్శకుడు వంశీ పైడిపల్లి లను నిర్మాతలుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. ఇప్పుడు పూర్తిగా నిలిపేసారు.అందుకు కారణంగా  ఇటీవలే విజయ్‌ - పూరిల కాంబినేషన్‌లో ‘లైగర్‌’ (Liger) చిత్రం డిజాస్టర్  కారణం చెప్తున్నారు. 

ఇక ‘జనగణమన’ చిత్రానికి అనుకున్న డేట్స్ ని విజయ్ దేవరకొండ ఇప్పుడు దిల్ రాజుకు ఇచ్చారని వినికిడి. అలా వైజాగ్ ఏరియాలో లైగర్ ని డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన దిల్ రాజుకు ఆ డేట్స్ పూరి ద్వారా ఎడ్జెస్ట్ అయ్యాయని తెలుస్తోంది. అలాగే పూరికి బాగా సన్నిహితుడు..దిల్ రాజు కు సైతం మిత్రుడైన హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నట్లు మీడియా వర్గాల ద్వారా సమాచారం.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం లైగర్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో చార్మి సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించగా విజయ్ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టారు. 

దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు. సమంతా రూత్ ప్రభు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి 70% షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద రూపొందిస్తున్నారు.

వాస్తవానికి  విజయ్ దేవరకొండ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే సుకుమార్ ఇంకా పుష్ప సీక్వెల్ సినిమా ప్రారంభించలేదు. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాతే విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా చేసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని  చెప్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios